కోవిడ్ తర్వాత బాలీవుడ్లో చాలా కాలం పాటు థియేటర్లు తెరుచుకోలేదు. ఇక థియేటర్లు తెరుచుకున్నాక కూడా జనాలు థియేటర్ కి రావడానికి ధైర్యం చేయలేదు. కొన్నాళ్ల తర్వాత జనాలు థియేటర్ కి వెళ్లడం స్టార్ట్ చేసినా.. ఏ సినిమా కూడా అక్కడ మునుపటిలా ఆడలేదు. 2021 , 2022 లో రిలీజ్ అయిన చాలా బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ గా మిగిలాయి. పెద్ద పెద్ద సినిమాలు కూడా అక్కడ ప్లాప్ అవ్వగా..
‘ది కశ్మీర్ ఫైల్స్’ వంటి చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. 2023 లో వచ్చిన ‘పఠాన్’ వరకు అక్కడ సరైన హిట్టు సినిమా పడలేదు. ‘పఠాన్’ తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్లు పడ్డాయి. అయితే మొదటి రోజు ఓ బాలీవుడ్ సినిమా వంద కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరడం అనేది షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమాతోనే జరిగింది. ఆ తర్వాత ‘జవాన్’ కూడా ఆ ఫీట్ ను సాధించింది. సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3 ‘ కూడా ఆ లిస్ట్ లో చేరుతుంది అనుకుంటే అలా జరగలేదు.
ఆ సినిమా రూ.90 కోట్ల గ్రాస్ మార్క్ వద్దే ఆగిపోయింది. అయితే లేటెస్ట్ గా వచ్చిన (Ranbir Kapoor) రణబీర్ కపూర్ ‘యానిమల్’ సినిమా ఆ ఫీట్ ను సాధించింది. ఈ సినిమా మొదటి రోజు ఎవ్వరూ ఊహించని విధంగా రూ.116 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది అని మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు. చిత్ర బృందం చెప్పిన నంబర్స్ కాబట్టి … ఇదే అఫీషియల్ అని చెప్పాలి. ఏమైనా సల్మాన్ వల్ల కానిది రణబీర్ కపూర్ సాధించాడు అనే కామెంట్స్ కూడా ఇప్పుడు ఎక్కువ వినిపిస్తున్నాయి.