రావు గోపాల్ రావు కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా … తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రావు రమేష్. ఇతను లేని స్టార్ హీరో సినిమా ఉండదేమో అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం చేస్తాడు మన రావు రమేష్. అప్పట్లో ఈయన తండ్రి రావు గోపాల్ రావు నటనతో ఏ రేంజ్ లో మెప్పించాడో… ఆయన పేరుని నిలబెడుతూ రావు రమేష్ కూడా అదే స్థాయిలో నటిస్తున్నాడు.
‘తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది..విడిపోయే ముందే బంధం విలువ ఏంటో తెలుస్తుంది’ ‘నువ్వు మెడిసిన్ లాంటి వాడివి.. కాని దానికి కూడా ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది’ వంటి ఎమోషనల్ డైలాగులతో పాటు.. ‘పిల్లలు పుట్టగానే పేర్లు పెట్టేయ కూడదు రా బాబు’ వంటి ఎటకారం పలికించాలి అన్నా.. ‘భజన … ప్రతీ దానికి భజన’ అంటూ ఫ్రస్ట్రేషన్ వినిపించాలి అన్నా.. రావు రమేష్ డైలాగ్ లకే చెల్లింది.
అలాంటి ఈ గొప్ప నటుడికి… నటన పై ఇష్టం లేదట. మొదట రావు రమేష్ డైరెక్టర్ కావాలి అనుకునే వడట. అదే విషయాన్ని తన తల్లికి చెబితే..’ డైరెక్షన్ అంటే 24 క్రాఫ్ట్స్ తెలిసి ఉండాలి. లెన్స్ లు తెలిస్తే సరిపోదు. జీవితం తెలియాలి. ముందు ముళ్ళ బాట ఉంటుంది. నీకు నటన చాలా తేలిక’ అని ఆమె చెప్పిందట. దాంతో ఈయన నటుడు అయ్యాడు. ఆమె అలా చెప్పకపోతే మనం ఓ గొప్ప నటుడుని మిస్ అయినట్టే.. అని చెప్పాలి.