సుధీర్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ నటించిన తాజా చిత్రం రావణాసుర. ఈ సినిమా ఏప్రిల్ 7వ తేదీ థియేటర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. సాధారణంగా ఏ సినిమాలు అయినా హీరోల పాత్ర చాలా పాజిటివ్ గా ఉంటుంది. కానీ రావణాసుర సినిమాలో రవితేజ పాత్ర చాలా భిన్నంగా ఉందని చెప్పాలి. ఇలా ఎన్నో అంచనాల నడుమ రావణాసుర సినిమా ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమాపై ఏర్పడిన అంచనాలను చేరుకోలేక పోయిందని చెప్పాలి.
ఇలా సినిమా విడుదలయి యావరేజ్ టాక్ సొంతం చేసుకోగా కలెక్షన్లు చూస్తే మాత్రం ఈ సినిమా బిలో యావరేజ్ టాక్ అని చెప్పాలి. ఇలా ఈ సినిమా విడుదలై భారీగా నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పాలి. ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ డిజిటల్ మీడియా సంస్థ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేశారు. థియేటర్లలో ఈ సినిమా చూడని వారు ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ సినిమా మే మొదటి లేదా రెండవ వారంలో ప్రసారమవుతుందని భావించారు. ఇలా మే మొదటి వారంలో ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని భావించగా అంతకుముందే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన తెలియజేయకముందే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.
థియేటర్లో పెద్దగా సక్సెస్ సాధించలేని (Ravanasura) రావణాసుర సినిమా డిజిటల్ మీడియాలో అయినా సక్సెస్ సాధిస్తుందో లేదో తెలియాల్సి ఉంది.ఇక ధమాకా సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న రవితేజ అదే జోష్ లో రావణాసుర సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా ఈ సినిమా తీవ్ర నిరాశపరిచిందనే చెప్పాలి.ఇక ప్రస్తుతం రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.