ఘాజీ సినిమాకు వాయిస్ ఓవర్ అందుకే ఇవ్వలేదంట
- January 30, 2017 / 01:48 PM ISTByFilmy Focus
యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో దగ్గుబాటి రానా కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఘాజీ’. 1971 వ సంవత్సరంలో ఇండియా-పాకిస్తాన్ మధ్య యుద్ధ కథాంశంతో హిందీ, తెలుగులో నిర్మితమైన ఈ మూవీ మూడు భాషల్లో రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 17న విడుదల కానున్న ఈ చిత్రానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తారని మొదట్లో ప్రచారం జరిగింది. కానీ ఆ ఛాన్స్ చిరంజీవికి వెళ్ళింది. ఇందుకు కారణం ఏమిటని ఆరా తీస్తే ఆసక్తికర విషయం బయట పడింది. తారక్ గతంలో రామ్ “రామ రామ.. కృష్ణ కృష్ణ” సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆ చిత్రం ఆశించినంతగా విజయం సాధించక పోవడంతో ఎన్టీఆర్ చాలా నిరుత్సాహ పడ్డారంట.
తాను వాయిస్ ఇస్తే ఆ చిత్రం ఫెయిల్ అవుతుందనే నమ్మకం బలంగా నాటుకుపోయిందని, ఆ బాధతోనే ఏ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇవ్వకూడదని అప్పుడే నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా తెలిసింది. అందుకే రానా కోరినా సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. భవిష్యత్తులో కూడా ఏ మూవీకి ఎన్టీఆర్ గొంతుని అరువు ఇచ్చే అవకాశం లేదని ఆయన సన్నిహితులు స్పష్టం చేశారు. పాటలు మాత్రం పాడుతారని చెప్పారు. గాయకుడిగా తారక్ కి మంచి ఫలితం రావడమే ఇందుకు కారణమని వివరించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















