‘లవ్ టుడే’ (Love Today) ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా నటించిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ (Return of the Dragon) గత వారం అంటే ఫిబ్రవరి 21న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ‘ఓ మై కడవులే'(తెలుగులో ‘ఓరి దేవుడా) ఫేమ్ అశ్వథ్ (Ashwath Marimuthu) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి తమిళంతో పాటు తెలుగులో కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్స్ బాగా వచ్చాయి. వీకెండ్ ను..శివ రాత్రి హాలిడే కలిసి రావడంతో ఈ సినిమా బాగానే క్యాష్ చేసుకుంది.అన్ సీజన్ అయినప్పటికీ బ్రేక్ ఈవెన్ కూడా సాధించింది.
ఇంకా డీసెంట్ షేర్స్ ని సాధిస్తుంది ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 1.98 cr |
సీడెడ్ | 0.60 cr |
ఆంధ్ర(టోటల్) | 1.72 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 4.30 cr |
‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ చిత్రానికి తెలుగులో రూ.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.3.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.4.30 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.7.2 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా బయ్యర్స్ కి రూ.0.80 కోట్ల లాభాలు బయ్యర్స్ కి అందించింది. రెండో వీకెండ్ ను కూడా ఈ సినిమా క్యాష్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి.