పెద్ద మనిషికి కనీస విలువనిద్దాం.. షూటింగ్‌లు రెండు రోజులు నిలిపేద్దాం.. ఇదీ రామ్‌గోపాల్ వర్మ లేటెస్ట్ ట్వీట్. ఇది ఎవరి గురించి ఆయన రాశారో, ఎవరిని ఉద్దేశించి రాశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోమవారం ఉదయాన్నే ఆయన ట్విటర్ అకౌంట్లో ఈ ట్వీట్లు కనిపించాయి. దీంతో ఒక్కసారిగా ఇవి వైరల్ అయిపోయాయి. ఈ ట్వీట్ల వెనుక ఉద్దేశం ఏంటి అనేది తెలియదు కానీ, ఆయన చెప్పిన సూచనలు మాత్రం బాగున్నాయి.
ప్రముఖ నటుడు కృష్ణంరాజు ఆదివారం కాలం చేశారనే విషయం తెలిసిందే. టాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది ఆయన ఇంటికి వచ్చి నివాళులర్పించారు. ట్వీట్లలో తమ సానుభూతి తెలిపారు. అయితే దీంతోపాటు మరోపని కూడా చేస్తే బాగుంటుంది అని సూచించారు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ‘‘మనసు లేకపోయినా ఓకే. కనీసం మన చావుకి విలువ ఉండాలంటే కృష్ణంరాజుగారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దాం’’ అని అన్నారు రామ్‌గోపాల్. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.
‘‘భక్త కన్నప్ప’, ‘కటకటాల రుద్రయ్య’, ‘బొబ్బిలి బ్రహ్మన్న’, ‘తాండ్ర పాపారాయుడు’ లాంటి అత్యంత గొప్ప చిత్రాలను అందించిన మహా నటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమకి నా జోహార్లు. సిగ్గు! సిగ్గు!’’ అంటూ కాస్త ఘాటుగానే ట్వీట్లు చేశారు వర్మ. ‘‘కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతోంది అని నెలరోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనది’’ అంటూ చురకలు కూడా అంటించాడు వర్మ.
మరి వర్మ మాటల్ని పరిశ్రమ వర్గాలు సీరియస్‌గా తీసుకుంటాయా లేదా అనేది చూడాలి. గతంలో చాలా సందర్భాల్లో వర్మను పరిశ్రమ లైట్ తీసుకుంది. ఒకవేళ ఇప్పుడు సీరియస్‌గా తీసుకుంటే షూటింగ్‌లు నిలిపేయాలి. నిన్న ఆదివారం కాబట్టి పెద్దగా షూటింగ్‌లు జరగలేదు. అయితే సోమవారం నుండి వరుస షూటింగ్‌లు ఉన్నాయని సమాచారం. కానీ ఈ రోజు అంత్యక్రియలు ఉండటం వల్ల షూటింగ్‌లు జరగవు అని అంటున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తే కృష్ణంరాజుకు గౌరవం ఇచ్చినట్లు అవుతుంది.
మనసు లేకపోయినా ఓకే. కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దాం .. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతోంది అని నెలరోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనది 🙏
నేను కృష్ణగారికి,మురళీమోహన్ గారికి, @urstrulyMahesh@PawanKalyan@KChiruTweets@themohanbabu బాలయ్యకి , ప్రభాస్ కి ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది.
కృష్ణగారికి,మురళీమోహన్ గారికి, చిరంజీవిగారికి , మోహనబాబుగారికి, బాలయ్యకి , ప్రభాస్ కి,మహేష్,కల్యాణ్కి నేను ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది.
భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలని అందించిన మహా నటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమ కి నా జోహార్లు. సిగ్గు! సిగ్గు!