ఎన్టీఆర్- రాంచరణ్ కాంబినేషన్లో టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గానే కాకుండా పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతోంది ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం. ‘బాహుబలి'(సిరీస్) కి మించిన బడ్జెట్ తో అంతకు మించిన స్థాయిలో దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడు. ఆల్రెడీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు.. జక్కన్న మార్క్ చిక్కుడు జరుగుతుందనేది ఇన్సైడ్ టాక్. 2022 జనవరి 7న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు కూడా దర్శకనిర్మాతలు ప్రకటించారు.
నవంబర్ నుండీ ఈ చిత్రం ప్రమోషన్లను షురూ కానున్నాయి అనేది ఇన్సైడ్ టాక్. ముందుగా దీపావళికి ఓ టీజర్ ఉంటుందని.. అది కూడా డైలాగ్స్ కూడా లేకుండా ఉంటుందని ఫిల్మీ ఫోకస్ ఆల్రెడీ తెలియజేయడం జరిగింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ టీజర్ 30 నుండీ 40 సెకండ్ల నిడివి కలిగి ఉంటుందట. అన్ని భాషల్లోనూ కలిపి ఈ ఒక్క టీజర్ నే విడుదల చేస్తారట. దాంతో ఎక్కువ వ్యూస్, లైక్స్ నమోదయ్యి, యూట్యూబ్ రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది.
‘కె.జి.ఎఫ్2’ టీజర్ విషయంలో కూడా ఇదే పద్దతిని ఫాలో అయ్యారు. మొన్నటికి మొన్న వచ్చిన ‘రాధే శ్యామ్’ విక్రమాదిత్య పాత్రని పరిచయం చేస్తూ వదిలిన టీజర్ విషయంలో కూడా ఇదే ఫార్ములా అప్లై చేయడం జరిగింది. దాని వల్ల ఆ టీజర్లకు ఎక్కువ వ్యూస్ నమోదయ్యాయి. ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ దీపావళి టీజర్ కూడా అదే విధంగా రికార్డులు క్రియేట్ చేస్తుందేమో చూడాలి..!