టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు టీజర్లు రిలీజ్ కాగా దీపావళి కానుకగా మరో టీజర్ రిలీజ్ కానుంది. ఆర్ఆర్ఆర్ దీపావళి టీజర్ లో చరణ్, తారక్ కలిసి కనిపించే సీన్స్ ఉంటాయని అయితే ఎలాంటి డైలాగ్స్ ఉండవని సమాచారం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమా కథకు సంబంధించి ప్రేక్షకుల్లో అవగాహన వచ్చేలా జక్కన్న టీజర్ ను రూపొందించారు.
వచ్చే నెల నుంచి ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల విషయంలో రాజమౌళి వేగం పెంచనున్నారని తెలుస్తోంది. డిసెంబర్ నెలలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కానుందని దేశంలోని ప్రముఖ నగరాల్లో ప్రచారాన్ని పూర్తి చేయాలని జక్కన్న భావిస్తున్నారని తెలుస్తోంది. ఇందుకోసం జక్కన్న ఆర్ఆర్ఆర్ నటులతో కలిసి కొచ్చిన్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ , పూణె, ముంబై, ఇతర నగరాలలో కూడా ప్రచారం నిర్వహించనున్నారని సమాచారం. 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కి జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది.
ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించి రఫ్ ఎడిట్ సిద్ధం కాగా నిడివి దాదాపుగా మూడు గంటలు వచ్చిందని ఆర్ఆర్ఆర్ సినిమాలో చివరి అరగంట ప్రేక్షకులు ఊహించని స్థాయిలో ట్విస్టులు ఉంటాయని సమాచారం అందుతోంది. మరోవైపు కరోనా పరిస్థితులు, ఏపీలో టికెట్ రేట్ల తగ్గింపు వల్ల దర్శకనిర్మాతలు ఈ సినిమా బిజినెస్ ఒప్పందాలను సమీక్షిస్తున్నారని తెలుస్తోంది.