దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో మెగాపవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ఈ చిత్రంలో కొమరం బీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామ రాజుగా రాంచరణ్ కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం 2020 జూలై 30 న విడుదల చేస్తామని రాజమౌళి అలాగే నిర్మాత డీ.వీ.వీ.దానయ్య ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ‘ఫ్రెండ్ షిప్’ డే రోజున ‘ఆర్.ఆర్.ఆర్’ టీమ్ నిర్వహించిన వేడుకలో కొమరం కొమరం భీమ్, అల్లూరి అనుకోకుండా మంచి మిత్రులు అవుతారని చెప్పారు.
అయితే వీరిద్దరూ నిజజీవితంలో వేరు వేరు ప్రాంతాలకి చెందినవారు. అల్లూరి సీతారామరాజు 1897 లో జన్మించి, విశాఖ ప్రాంతానికి చెందిన అడవి జాతి ప్రజల హక్కుల కొరకు పోరాడి 1924లో ప్రాణాలు విడిచారు. ఇక కొమరం భీమ్ 1901లో జన్మించి హైదరాబాద్ నవాబు పాలనకు వ్యతిరేకంగా పోరాడి 1940లో మరణించిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ కలిసినట్టుగా చరిత్రలో ఎక్కడా బలమైన ఆధారాలు లేవు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ గొప్ప స్నేహితులు ఎలా అనేది ఆసక్తిని పెంచే విషయం. ‘ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ అని… వీరిద్దరూ కలిసి పోరాటం చేస్తారనే’ విషయాన్ని మాత్రం రాజమౌళి ప్రెస్ మీట్లో చెప్పాడు. ‘బాహుబలి ది బిగినింగ్’ సినిమా విడుదలయ్యాక ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు’ అనే సస్పెన్సు తో ‘బాహుబలి2’ కి విపరీతమైన హైప్ పెంచాడు. ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ విషయంలో తో అయితే టైటిల్ తోనూ అలాగే హీరోలిద్దరూ ఎలా స్నేహితులవుతారు అనే వాటితో మరింత హైప్ పెంచుతున్నాడన్న మాట.