‘బాహుబలి'(సిరీస్) తర్వాత స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ఇద్దరు స్టార్ హీరోలైన మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ లు కలిసి నటిస్తున్న ఈ భారీ మల్టీ స్టారర్ చిత్రాన్ని అగ్ర నిర్మాత డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం 2021 సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల కాబోతుంది. దాదాపు 10 భాషల్లో ఈ చిత్రం ఏక కాలంలో విడుదల కాబోతుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన బిజినెస్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం బిజినెస్ అప్పుడే పూర్తయిపోయింది.
ఇక ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం
85 cr
సీడెడ్
50 cr
ఉత్తరాంధ్ర
30 cr
ఈస్ట్
18 cr
వెస్ట్
14 cr
కృష్ణా
15 cr
గుంటూరు
20 cr
నెల్లూరు
10 cr
ఏపీ +తెలంగాణ
242 cr
ఇది డిస్ట్రిబ్యూటర్ ల వర్గాల నుండీ లభించిన సమాచారం. దీనిని బట్టి చూస్తే ‘ఆర్.ఆర్.ఆర్’ తెలుగు రాష్ట్రాల్లో 250 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. జనవరి 8న విడుదల కాబోతుంది కాబట్టి సంక్రాంతి సినిమాలు వారం తర్వాతే రిలీజ్ అవుతాయని తాజా సమాచారం. దానిని బట్టి మొదటి వారం ఈ చిత్రం 300 కోట్ల షేర్ ను రాబట్టినా ఆశ్చర్యం లేదు. మరో పక్క ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం పక్కన మరో చిత్రం విడుదల చెయ్యడం కూడా పెద్ద సాహసమనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో అజయ్ దేవగన్, అలియా భట్ వంటి వారు నటిస్తుండడంతో బాలీవుడ్ లో కూడా భారీ రేటు పలుకుతున్నట్టు తెలుస్తుంది.