మలయాళం సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ ని తెలుగులో ‘గాడ్ ఫాదర్’ గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా ఆల్రెడీ తెలుగులో డబ్ అయ్యింది. లాక్ డౌన్ టైంలో చాలా మంది ప్రేక్షకులు చూసేసారు. అయినా కొన్ని మార్పులు చేసి రీమేక్ చేస్తున్నారు. ‘గాడ్ ఫాదర్’ కి ఏమైనా ఆకట్టుకునే అంశం ఉందా అంటే.. అది బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించడం అనే చెప్పాలి. ఒరిజినల్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్ర అది.
ఒరిజినల్ లో ఆ పాత్రకు డైలాగులు కూడా ఎక్కువగా ఉండవు. కానీ తెలుగుకి వచ్చేసరికి ఆ పాత్రని 20 నిమిషాల పాటు పెంచారు. ఓ పాట కూడా యాడ్ చేశారు. అందులో చిరు, సల్మాన్ కలిసి డ్యాన్స్ చేస్తున్న ప్రోమోని తాజాగా విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ లభించింది. అంతా బాగానే ఉంది కానీ సల్మాన్ ఖాన్ హిందీలో నటించే ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల పైగా పారితోషికం అందుకుంటారు. లాభాల్లో వాటాలు కలుపుకొని ఇంకా ఎక్కువగానే ఉంటుంది.
మరి ‘గాడ్ ఫాదర్’ సినిమాకి ఎంత పారితోషికం తీసుకుని ఉంటారు? అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. సల్మాన్ ఖాన్.. చిరు, చరణ్ లకు మంచి స్నేహితుడు. ఆయన హైదరాబాద్ వస్తే చాలు చిరు, చరణ్ లను కలవకుండా వెళ్ళడు. కాబట్టి ‘గాడ్ ఫాదర్’ కి సల్మాన్ పారితోషికం తీసుకుని ఉండడు అని అంతా అనుకున్నారు. కానీ ‘గాడ్ ఫాదర్’ చిత్రానికి బడ్జెట్ పెట్టేది చిరు, చరణ్ లు కాదు. వాళ్ళు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు అంతే..!
వీళ్ళ రిక్వెస్ట్ మేరకు ‘గాడ్ ఫాదర్’ లో నటించడానికి సల్మాన్ ఒప్పుకున్నాడు అంతే..! కానీ ఈ చిత్రంలో నటించినందుకు గాను అతను అక్షరాలా రూ.40 కోట్ల పారితోషికం అందుకున్నాడట. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి.. సల్మాన్ ఖాన్ మార్కెట్ ప్లస్ అవుతుంది అని మేకర్స్ భావిస్తున్నారు.