Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » ఇంటర్వ్యూలు » Samantha: ఇంటర్వ్యూ : ‘యశోద’ గురించి సమంత చెప్పిన ఆసక్తికర విషయాలు..!

Samantha: ఇంటర్వ్యూ : ‘యశోద’ గురించి సమంత చెప్పిన ఆసక్తికర విషయాలు..!

  • November 9, 2022 / 12:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: ఇంటర్వ్యూ : ‘యశోద’ గురించి సమంత చెప్పిన ఆసక్తికర విషయాలు..!

ఈ నవంబర్ 11న సమంత ‘యశోద’ గా ప్రేక్షకులను పలకరించనుంది. అయితే ఈ టైంలో సమంత మయోసైటిస్‌తో బాధపడుతుంది. హరి, హరీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘శ్రీదేవి మూవీస్’ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదలవుతుంది. ఈ తరుణంలో అదీ సమంత పరిస్థితి ఏమీ బాలేకపోయినప్పటికీ ప్రమోషన్స్ లో పాల్గొంది. ఈ సందర్భంగా ‘యశోద’ గురించి తన ఆరోగ్యం గురించి సమంత చెప్పిన ఆసక్తికర సంగతులు మీకోసం :

నమస్తే సమంత గారు… ఇప్పుడు మీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది?

థాంక్యూ అండి… ఇలా అడిగినందుకు! ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్నాను. త్వరలోనే పూర్తిగా కోలుకుంటాను అని ఆశిస్తున్నాను. ఈ క్షణం, నేను ఈ రోజు గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. ఈరోజుకి, ఈ క్షణం వరకు తీసుకుంటే నేను ‘యశోద’ గురించి ఎగ్జైట్ అవుతున్నాను.

మీ హెల్త్ గురించి సోషల్ మీడియాలో రకరకాల న్యూస్ లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు?

అవును… నేను కూడా చాలా ఆర్టికల్స్ చదివాను. అయితే… ప్రస్తుతానికి నేను చావలేదు (నవ్వులు). నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. ఫైట్ చేస్తున్నాను. నేను ఉన్న పరిస్థితిలో అది అంత ప్రాణాంతకమైనది ఏమీ కాదు.

ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి మీరు ధైర్యాన్ని ఎలా బిల్డ్ చేసుకుంటారు?

నేను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినట్టు… కొన్ని మంచి రోజులు ఉంటాయి. కొన్ని చెడ్డ రోజులు ఉంటాయి. ఒక్కోరోజు ఇంకొక్క అడుగు కూడా ముందు వేయలేనేమో అనిపిస్తోంది. కొన్ని రోజులు వెనక్కి తిరిగి చూస్తుంటే నేను ఇంత దూరం వచ్చానా? అనిపిస్తోంది. చాలా మంది ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. పోరాడుతూ పోరాడుతూ చివరికి విజయం సాధిస్తాం.

‘యశోద’… టీజర్, ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. ఆడియన్స్ రియాక్షన్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది?

చాలా సంతోషంగా ఉంది.ఇన్ ఫాక్ట్ చాలా ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది. అలాగే కొంచెం నెర్వస్ కూడా ఉంది. టీజర్, ట్రైలర్లో మేము చూపించింది నిజమే. సినిమాలో ఏం ఉందో అదే చూపించాం. ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్లకు టీజర్, ట్రైలర్ నచ్చాయి. సినిమా కూడా నచ్చుతుందని భావిస్తున్నాను.

‘యశోద’ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఏంటి? కథ చెప్పినప్పుడు వెంటనే ఓకే చేశారా? లేదంటే ఆలోచించారా?

నిజానికి నేను ఒక స్క్రిప్ట్ ఓకే చెయ్యాలి అంటే ఒక రోజు సమయం తీసుకుంటా. కానీ, ‘యశోద’ కథ మాత్రం వెంటనే ఓకే చేశా. నేను విన్న వెంటనే ఓకే చేసిన కథల్లో ‘యశోద’ ఒకటి. ‘యశోద’ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. పవర్ ఫుల్ స్టోరీ ఇది. అందుకే ఎక్కువగా ఆలోచించడానికి ఏమీ లేదు. కథ విన్నప్పుడు గూజ్ బంప్స్ వచ్చాయి. థ్రిల్ అయ్యాను. ప్రేక్షకులు కూడా అదే విధంగా థ్రిల్ అవుతారని, వాళ్ళకి గూస్ బంప్స్ వస్తాయని ఆశిస్తున్నాను. సినిమాలో అంత పవర్ ఉంది. దర్శకులు హరి, హరీష్ కొత్త కాన్సెప్ట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

పురాణాల్లో ‘యశోద’ గురించి విన్నాం. మోడ్రన్ ‘యశోద’ ఎలా ఉంటుంది?

ఇద్దరూ మహిళలే. ఇద్దరూ అమ్మలే. చాలా మందిని రక్షించారు. ప్రేక్షకులకు శ్రీ కృష్ణుడిని పెంచిన ‘యశోద’ గురించి తెలుసు. పురాణాలపై అందరికీ అవగాహన ఉంది. మా సినిమా చూసిన తర్వాత ‘యశోద’ క్యారెక్టర్ గురించి ఇంకా బాగా అర్థం అవుతుంది అనేది నా నమ్మకం.

ఇప్పుడు సరోగసీ అనేది కామన్ అయ్యింది. సరోగసీ మీద మీ అభిప్రాయం?

సరోగసీ మీద నాకు బలమైన అభిప్రాయం లేదు. తల్లిదండ్రులు కావాలని అనుకునే వాళ్ళకు అదొక పరిష్కారం మాత్రమే. వాళ్ళ ఆశలకు ఆయువు పోస్తుంది.

సినిమాలో సరోగసీ మాత్రమే కాకుండా పాలిటిక్స్, వరల్డ్ రిచ్ విమెన్ ఇష్యూస్ ఉన్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజమేనా?

కథ గురించి ఇంతకు మించి చెబితే … సినిమా చూస్తున్నప్పుడు థ్రిల్ మిస్ అవుతారు. ‘యశోద’ ఒక మంచి థ్రిల్లర్. థియేటర్లో చూసేటప్పుడు తర్వాత ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీ అందరికీ కలుగుతుంది. దర్శకులు కథ, స్క్రీన్ ప్లే రాసిన విధానం… స్క్రీన్ మీదకు తీసుకు వచ్చిన తీరు… ఫైట్స్, సెట్స్, ఆర్ట్ వర్క్, మ్యూజిక్… ప్రతీది సూపర్. తప్పకుండా థియేటర్లలో చూడాల్సిన సినిమా ఇది. వెండితెరపై ఎంజాయ్ చేయాలి.

మీరు డిఫరెంట్ జానర్ సినిమాలు చేశారు. యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేయడంలో ఉండే థ్రిల్ ఏమిటి?

కథలు వినేటప్పుడు, క్యారెక్టర్ విషయంలో… ఇంకాస్త డిఫరెంట్‌గా, కొత్తగా ఉండాలని భావిస్తాను. అలా ఉండేలా చూస్తాను. ‘యశోద’ కంటే ముందు ‘యూ – టర్న్’ చేశా. అది కూడా థ్రిల్లర్. కానీ, ‘యశోద’ చాలా కొత్తగా ఉంటుంది. యాక్షన్ పరంగా కూడా కొత్తగా ఉంటుంది. యాక్షన్ చేయడం ఎంజాయ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ‘ఫ్యామిలీ మ్యాన్ 2’లో రాజీ రోల్ కోసం యాక్షన్ చేశాను. నిజం చెప్పాలంటే… యాక్షన్ చేసేటప్పుడు చాలా ఉల్లాసంగా ఉంటుంది. ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాను.

యాక్షన్ సీన్స్ కోసం మీరు ఎలాంటి ట్రైనింగ్ తీసుకున్నారు?

యానిక్ బెన్ తో ‘ఫ్యామిలీ మ్యాన్ 2’కి పని చేశా. అందులో నా పాత్ర కోసం కిక్ బాక్సింగ్, బాక్సింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నాను. ‘యశోద’లో నేను సింపుల్ ప్రెగ్నెంట్ లేడీగా చేశా. ఆ పాత్రకు తగ్గట్టు యాక్షన్ డిజైన్ చేశారు యానిక్ బెన్, వెంకట్ మాస్టర్… ఇద్దరూ ఫైట్స్ అన్నీ రా అండ్ రియల్ గా ఉండేలా చూసుకున్నారు. అదే సమయంలో పాత్రకు తగ్గట్టు ఉండేలా బ్యాలన్స్ చేశారు. అందుకు తగ్గట్టే నేను ప్రాక్టీస్ చేశాను.

ఈ సినిమాలో చాలా మంది క్యాస్టింగ్ ఉంది. సెట్స్ లో అందరూ కలిసినప్పుడు ఎలా అనిపించేది?

నిజంగా వండర్ ఫుల్ ఎక్స్‌పీరియన్స్. మన చుట్టూ ఎంతో అనుభవం ఉన్న ఆర్టిస్టులు ఉన్నప్పుడు వాళ్ళ నుంచి ఎంతో కొంత నేర్చుకోవచ్చు. ‘యశోద’లో వేరే భాషకు చెందిన నటీనటులు ఉన్నారు. ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకునే విషయం ఒకటి ఉంది. మలయాళం యాక్టర్ డైలాగ్ చెప్పే విధానం, తెలుగు యాక్టర్లు చెప్పే విధానానికి వేరుగా ఉంటుంది. అంత మందితో కలిసి నటించడం ఆసక్తికరంగా అనిపించింది. వాళ్ళందరి నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను.

ట్రైలర్ విజువల్స్ చూస్తే ప్రొడక్షన్ వేల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. నిర్మాత శివలెంక కృష్ణ గారి గురించి చెప్పండి.. క్వాలిటీ విషయంలో ఆయన ఎలాంటి సూచనలు ఇస్తారు?

సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్ కోసం లోకల్ హోటల్స్, హాస్పిటల్స్ చాలా చూశారు. కానీ, ఏవీ సెట్ కాలేదు. దీంతో ఆయనే భారీ సెట్ వేయించారు. శివలెంక కృష్ణ ప్రసాద్ గారు సినిమా గొప్పగా ఉండాలని కోరుకుంటారు. అవుట్‌పుట్ బాగా రావాలని ఖర్చుకు వెనుకాడకుండా ముందుకు వెళ్లే మనిషి.

‘యశోద’ పాన్ ఇండియా మూవీ కథ.. అది ముందుగా అనుకున్నదా? లేక తర్వాత పాన్ ఇండియా ఐడియా వచ్చిందా?

కథ, సినిమాలో గొప్ప ఎమోషన్ ఉంది. ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విధంగా ఉంది అలాగే కథలో పొటెన్షియాలిటీ కూడా ఉందనిపించింది. షూటింగ్ చేసేటప్పుడు మా కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. ఎమోషనల్ పాయింట్ కావడంతో అన్ని భాషల ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని, అందరికీ నచ్చుతుందని భావించి మొత్తం ఐదు భాషల్లో విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు, మీడియా ‘పాన్ ఇండియా’ అంటున్నారు. పాన్ ఇండియా హిట్ అవుతుందని ఆశిస్తున్నా.

వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించుకునే వెసులుబాటు ఉన్నా సరే సెలైన్ బాటిల్ తో డబ్బింగ్ చెప్పారు. అందుకు కారణం?

‘యశోద’కు నేనే డబ్బింగ్ చెప్పాలని ముందే డిసైడ్ అయ్యాను. ఒక్కసారి నేను కమిట్ అయ్యానంటే… చేయాల్సిందే. ఓ క్యారెక్టర్ చేసేటప్పుడు ఆర్టిస్ట్ ప్రాణం పెట్టారంటే… వాళ్ళే డబ్బింగ్ చెప్పాలని కోరుకుంటారు. తమ వాయిస్ వినిపించాలని అనుకుంటారు. నేను ఇంతే… నాలో ఆ పట్టుదల ఉంది. నాకు మొండితనం ఎక్కువ. సవాళ్లు ఎదురైనప్పటికీ డబ్బింగ్ చెప్పగలిగినందుకు సంతోషంగా ఉంది.

‘యశోద’లో మీ క్యారెక్టర్ కాకుండా మీకు బాగా నచ్చింది రోల్?

వరలక్ష్మీ శరత్ కుమార్ క్యారెక్టర్. సినిమా చూస్తే నేను ఈ మాట ఎందుకు చెబుతున్నానో అర్థం అవుతుంది. ఇంతకు మించి ఏమైనా చెబితే స్పాయిలర్ అవుతుంది.

మీ హెల్త్ కండిషన్ తెలుసుకోవాలని అభిమానులు ప్రతిక్షణం తపిస్తున్నారు? మీరు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు?

ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ, అభిమానం, మద్దతుకు థాంక్స్. నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను. ఇదొక యుద్ధం. ఆ యుద్ధంలో పోరాటం చేయడానికి మీరందరూ చూపిస్తున్న ప్రేమ, మద్దతే కారణం.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Interviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari - Harish
  • #Samantha
  • #Unni Mukundan
  • #Varalaxmi Sarathkumar
  • #Yashoda

Also Read

Coolie Collections: వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘కూలీ’.. కానీ

Coolie Collections: వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘కూలీ’.. కానీ

War 2 Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘వార్ 2’

War 2 Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘వార్ 2’

Rahul Sipligunj: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్.. అమ్మాయి ఎవరంటే?

Rahul Sipligunj: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్.. అమ్మాయి ఎవరంటే?

VN Aditya: సమ్మె పేరుతో కార్మికులకు పని లేకుండా చేయకూడదు

VN Aditya: సమ్మె పేరుతో కార్మికులకు పని లేకుండా చేయకూడదు

Aamir Khan: సూర్యని మ్యాచ్ చేయలేకపోయిన ఆమిర్.. ఎక్కడ తేడా కొట్టింది?

Aamir Khan: సూర్యని మ్యాచ్ చేయలేకపోయిన ఆమిర్.. ఎక్కడ తేడా కొట్టింది?

Rao Bahadur Teaser Review – ఇది టీజర్ కాదు.. అంతకుమించి

Rao Bahadur Teaser Review – ఇది టీజర్ కాదు.. అంతకుమించి

related news

Samantha: ఇంకెన్నాళ్లీ ‘క్లిక్‌’ బైట్‌లు.. ఓపెన్‌ అవ్వొచ్చుగా సామ్‌.. ఎందుకని ఇలా?

Samantha: ఇంకెన్నాళ్లీ ‘క్లిక్‌’ బైట్‌లు.. ఓపెన్‌ అవ్వొచ్చుగా సామ్‌.. ఎందుకని ఇలా?

Alludu Seenu Collections: డెబ్యూ హీరోల్లో అరుదైన రికార్డ్.. 11 ఏళ్ళ ‘అల్లుడు శీను’ కలెక్షన్స్ ఇవే

Alludu Seenu Collections: డెబ్యూ హీరోల్లో అరుదైన రికార్డ్.. 11 ఏళ్ళ ‘అల్లుడు శీను’ కలెక్షన్స్ ఇవే

Varalaxmi Sarathkumar: వరలక్ష్మీకి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన భర్త.. ఎన్ని కోట్లో తెలుసా?

Varalaxmi Sarathkumar: వరలక్ష్మీకి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన భర్త.. ఎన్ని కోట్లో తెలుసా?

Samantha: ఒక డిజాస్టర్‌.. ఒక హిట్‌.. సామ్‌ – నందిని ఇప్పుడేం చేస్తారో?

Samantha: ఒక డిజాస్టర్‌.. ఒక హిట్‌.. సామ్‌ – నందిని ఇప్పుడేం చేస్తారో?

trending news

Coolie Collections: వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘కూలీ’.. కానీ

Coolie Collections: వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘కూలీ’.. కానీ

28 mins ago
War 2 Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘వార్ 2’

War 2 Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘వార్ 2’

5 hours ago
Rahul Sipligunj: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్.. అమ్మాయి ఎవరంటే?

Rahul Sipligunj: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్.. అమ్మాయి ఎవరంటే?

5 hours ago
VN Aditya: సమ్మె పేరుతో కార్మికులకు పని లేకుండా చేయకూడదు

VN Aditya: సమ్మె పేరుతో కార్మికులకు పని లేకుండా చేయకూడదు

7 hours ago
Aamir Khan: సూర్యని మ్యాచ్ చేయలేకపోయిన ఆమిర్.. ఎక్కడ తేడా కొట్టింది?

Aamir Khan: సూర్యని మ్యాచ్ చేయలేకపోయిన ఆమిర్.. ఎక్కడ తేడా కొట్టింది?

8 hours ago

latest news

Mokshagna: మోక్షజ్ఞ కొత్త పిక్‌ వైరల్.. డెబ్యూకి అదే అడ్డయితే ఇప్పుడు మొదలెట్టేస్తారుగా!

Mokshagna: మోక్షజ్ఞ కొత్త పిక్‌ వైరల్.. డెబ్యూకి అదే అడ్డయితే ఇప్పుడు మొదలెట్టేస్తారుగా!

5 hours ago
Manchu Manoj: ‘మంచు’ వారసులు కలసిపోతున్నారా? మనోజ్‌ కొత్త పోస్ట్‌కి అర్థం ఇదేనా?

Manchu Manoj: ‘మంచు’ వారసులు కలసిపోతున్నారా? మనోజ్‌ కొత్త పోస్ట్‌కి అర్థం ఇదేనా?

5 hours ago
Tollywood: చిరంజీవి ముందుకు ‘టాలీవుడ్‌ పంచాయితీ’ ప్రీ క్లైమాక్స్‌.. ఏం జరుగుతుందో?

Tollywood: చిరంజీవి ముందుకు ‘టాలీవుడ్‌ పంచాయితీ’ ప్రీ క్లైమాక్స్‌.. ఏం జరుగుతుందో?

8 hours ago
Vijay Devarakonda and Rashmika: అమెరికాలో విజయ్‌ – రష్మిక సందడి.. చేతిలో చేయి వేసి నడుస్తూ..

Vijay Devarakonda and Rashmika: అమెరికాలో విజయ్‌ – రష్మిక సందడి.. చేతిలో చేయి వేసి నడుస్తూ..

8 hours ago
Nagarjuna: ఆ సినిమా హిట్టైనా హీరోయిన్ కి, దర్శకుడికే క్రెడిట్ ఇచ్చారు.. నేను బొమ్మలా ఉండిపోవలసి వచ్చింది

Nagarjuna: ఆ సినిమా హిట్టైనా హీరోయిన్ కి, దర్శకుడికే క్రెడిట్ ఇచ్చారు.. నేను బొమ్మలా ఉండిపోవలసి వచ్చింది

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version