టాలీవుడ్ క్యూట్ బ్యూటీ సమంత జనతాగ్యారేజ్ తర్వాత తెలుగులో రామ్ చరణ్ మూవీలో నటించేందుకు సైన్ చేసింది. డైరక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ నుంచి ఆమె తప్పుకుంది. సమంత బయటికి వెళ్లిపోవడంపై ఆరా తీస్తే అసలు విషయం బయట పడింది. మైత్రీ మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ మూవీ జనవరి 30 న పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఫిబ్రవరి 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వాలి. మార్చిలోకి వచ్చినా సెట్స్ పైకి వెళ్ళలేదు. చిత్ర బృందం లొకేషన్ వేటలోనే ఉంది. అందుకే ఈ చిత్ర షెడ్యూల్ లో మార్పులు జరిగింది. ఇక సమంత లైఫ్ లోను మార్పులు జరిగింది. ఆగస్టులో నాగచైతన్యతో కలిసి పెళ్లి పీటలు ఎక్కాలని అనుకున్న ఆమె కోరిక తొందరగా నెరవేరబోతోంది. కళ్యాణం ముందుగానే జరగనుందని, అందుకోసం షూటింగ్ డేట్స్ లో మార్పు చేయాలనీ సమంత డైరక్టర్ ని కోరింది.
ఇప్పుడే లొకేషన్ సెట్ కాక అయోమయంలో ఉన్న సుకుమార్ కి ఈ సమస్య ఇబ్బంది పెట్టింది. సో గజి బిజీ గందరగోళం ఎందుకు హ్యాపీగా పెళ్లిచేసుకోమని సమంతకు చెప్పినట్లు సమాచారం. ఈ సినిమాలో మొదటగా అనుపమ పరమేశ్వరన్ ను తీసుకొని, ఆ తర్వాత ఆమెను కాదనుకుని సమంతాను తీసుకున్నారు. ఆమె కూడా తప్పుకోవడంతో చిత్ర బృందం మరో హీరోయిన్ వేటలో పడింది. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్న ఇందులో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates