Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » జనతా గ్యారేజ్ పోస్టర్స్ లో ఇవి గమనించారా ?

జనతా గ్యారేజ్ పోస్టర్స్ లో ఇవి గమనించారా ?

  • August 12, 2016 / 08:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జనతా గ్యారేజ్ పోస్టర్స్ లో ఇవి గమనించారా ?

హిట్ డైరక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం జనతా గ్యారేజ్. ఈ ఏడాది అందరూ ఎదుచూస్తున్న సినిమా ఇది. వరుస విజయాలతో హిట్ ట్రాక్ లో వీరిద్దరూ కలిసి చేస్తున్న మూవీ కావడం తో క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లతో పాటు టీజర్ అభిమానుల్లో ఉన్న అంచనాలను పెంచింది. ఈ పోస్టర్లను గమనిస్తే జనతా గ్యారేజ్ లో ఉండే కొన్ని కీలక అంశాలు తెలుస్తాయి. అవి ఏంటంటే..?

01. ఆసక్తి కలిగించిన ఫస్ట్ లుక్

001

జనతా గ్యారేజ్ సినిమాలో తారక్ లుక్ ని ఫస్ట్ లుక్ ద్వారా రివీల్ చేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఐఐటీ విద్యార్థిగా నటిస్తున్నారు. ఆ విషయాన్నీ ఈ పోస్టర్ వెల్లడించింది. స్టూడెంట్ వన్ చిత్రంలో మాదిరిగా భుజాన బ్యాగ్ తగిలించుకున్నా.. అతని బ్యాగ్ గ్రౌండ్ పరిశీలిస్తే ఎన్నో ప్రశ్నలను మన ముందు ఉంచుతాయి. ఎవరైనా కాలేజీకి ఇంట్లో నుంచి వెళుతారు.. లేదా హాస్టల్, రూమ్ నుంచి బయలు దేరుతారు. గ్యారేజ్ నుంచి వస్తున్న ఎన్టీఆర్ పోస్టర్ చూసినప్పుడు ఆసక్తిని కలిగించింది.

02. వేరే వారిపై లుక్

002
రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చిన మరో పోస్టర్ లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో తారక్ కలిసి నడిచి వస్తుంటారు. ఇందులో ముస్లింల సాంప్రదాయ వేషధారణలో కనిపిస్తారు. అయితే నమాజును వెళుతున్నట్లు పైకి కనిపిస్తున్నా.. ఎవరికోసమో వెతుకుతున్నట్లు ఉంది. ఆ విషయం మోహన్ లాల్, ఎన్టీఆర్ లు తమ మోహంలో దాచి పెట్టారు కానీ, వారి వెనుక వస్తున్న అజయ్, బ్రహ్మజీ కళ్లు మాత్రం మనకి స్పష్టంగా చెప్పేస్తున్నాయి. ఈ రోజు ఎవరికో మూడింది అని.

03. పక్కా భారీ ఫైట్

003
మాస్ అభిమానులను విపరీతంగా నచ్చిన పోస్టర్ ఇది. తారక్ కి ఒక గ్యాంగ్ ఉందని, సెటిల్ మెంట్ చేస్తుంటారని ఈ పోస్టర్ చెబుతోంది. క్లాస్ రూంలో బుక్ లోని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడమే కాదు, బయట సమస్య సృష్టించిన వారి పని కూడా పడుతాడని వెల్లడిస్తోంది. ఈ పోస్టర్ చూసిన వెంటనే ఇక్కడ ఒక భారీ ఫైట్ ఉందని అభిమానులు ఫిక్స్ అయిపోయారు.

04. రొమాన్స్ మిస్ కాలేదు

004
జనతా గ్యారేజ్ పూర్తి యాక్షన్ చిత్రం కదా.. రొమాన్స్ మిస్ అయిపోయిందని కంగారు పడుతున్న వారికి ఈ చిత్రం సంతోషం కలిగించింది. తారక్ సరదా యాంగిల్ ని ఈ పోస్టర్ లో చూపించారు. ఒకరు కాదు ఇద్దరు సుందరాంగులతో ఎన్టీఆర్ ప్రేమ సన్నివేశాలు ఉంటాయని డైరక్టర్ స్పష్టం చేశారు. ఈ పోస్టర్ ద్వారా చిత్రంలోని హీరోయిన్లు సమంత, నిత్యా మీనన్ లుక్ లు తొలిసారి రివీల్ చేశారు.

05. అనుబంధాలు

005
జనతా గ్యారేజ్ లో భారీ తారాగణం ఉంది. ఎక్కువమంది సీనియర్ నటీనటులు నటించారు. కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయత అనురాగాలకు కొదవలేదు. ఇందులో మోహన్ లాల్ తారక్ కి మామయ్యగా నటిస్తున్నట్లు సమాచారం. మామయ్య సూచనలు శ్రద్దగా వింటున్న అల్లుడు పోస్టర్ చిన్న పెద్ద అందరినీ ఆకట్టుకుంది. బ్యాగ్రౌండ్లో పిల్లలను చూస్తుంటే అది ఇంట్లో వేడుక నాటి సన్నివేశంగా అనిపిస్తోంది. మహిళలకు నచ్చే సీన్లు ఇందులో ఉన్నాయని డైరక్టర్ ఈ చిత్రం ద్వారా హింట్ వదిలారు.

06. ముంబై లోనే

006
సింహాద్రిలో తమిళనాడు నేపథ్యంలో కథ సాగితే, జనతా గ్యారేజ్ కథ ఎక్కువ భాగం ముంబై లోనే జరుగుతుందని తాజా పోస్టర్ వెల్లడించింది. తారక్ నడుపుతున్న బైక్ ని పరిశీలిస్తే దానిపై ఎమ్ హెచ్ అని ఉంది. అంటే మహారాష్ట్ర ప్రభుత్వం రిజిస్టేషన్ వాహనంగా తెలుస్తోంది. సో ముంబై లోనే ఐఐటీ స్టూడెంట్ చెలరేగి పోనున్నట్లు అర్ధమవుతోంది. అయితే బైక్ పై తరలిస్తున్న మొక్కలను చూస్తుంటే .. ఈ పోస్టర్ లోను డైరక్టర్ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోంది. అది ఏమిటో తెలుసుకోవాలంటే సెప్టెంబర్ 2 వరకు ఆగాల్సిందే.

మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న జనతా గ్యారేజ్ లో అన్నివర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునే అంశాలు ఉన్నాయని ఈ పోస్టర్లు స్పష్టంగా చెబుతున్నాయి. యూత్ మెచ్చే లవ్, హుషారైన పాటలు, మాస్ ప్రేక్షకులకు నచ్చే యాక్షన్ సన్నివేశాలు, మహిళలను ఆకట్టుకునే సెంటిమెంట్ సీన్లు.. అన్నింటిని మిక్స్ చేసి కొరటాల శివ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందించారని తెలుస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #janatha garage Movie
  • #Janatha Garage Movie New Posters
  • #Janatha Garage Movie Songs
  • #Jr Ntr
  • #Nithya Menen

Also Read

Kanchana Collections: 14 ఏళ్ళ ‘కాంచన’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Kanchana Collections: 14 ఏళ్ళ ‘కాంచన’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Bhagyashri Borse: ‘మిస్టర్ బచ్చన్’ బ్యూటీకి టెస్టింగ్ టైం..!

Bhagyashri Borse: ‘మిస్టర్ బచ్చన్’ బ్యూటీకి టెస్టింగ్ టైం..!

Ravi Teja: రవితేజపై ‘కలర్ ఫోటో’ దర్శకుడు సందీప్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Ravi Teja: రవితేజపై ‘కలర్ ఫోటో’ దర్శకుడు సందీప్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Lokesh Kanagaraj, Nagarjuna: నాగార్జున గురించి దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Lokesh Kanagaraj, Nagarjuna: నాగార్జున గురించి దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Genelia Interview: నా సినిమాలు చూసుకుని నేనే బాధపడే నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోలేదు – జెనీలియా దేశ్ముఖ్

Genelia Interview: నా సినిమాలు చూసుకుని నేనే బాధపడే నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోలేదు – జెనీలియా దేశ్ముఖ్

Ravi Teja Father Rajagopal Raju: రవితేజ ఇంట తీవ్ర విషాదం.. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు కన్నుమూత!

Ravi Teja Father Rajagopal Raju: రవితేజ ఇంట తీవ్ర విషాదం.. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు కన్నుమూత!

related news

విక్రమ్ టు ఎన్టీఆర్… పాత్రల డిమాండ్ మేరకు వర్కౌట్లు చేసి స్లిమ్ అయిన హీరోల లిస్ట్..!

విక్రమ్ టు ఎన్టీఆర్… పాత్రల డిమాండ్ మేరకు వర్కౌట్లు చేసి స్లిమ్ అయిన హీరోల లిస్ట్..!

Jr NTR, Hrithik Roshan: ‘వార్ 2’ కోసం హైదరాబాద్ కి హృతిక్.. ఎప్పుడంటే..?!

Jr NTR, Hrithik Roshan: ‘వార్ 2’ కోసం హైదరాబాద్ కి హృతిక్.. ఎప్పుడంటే..?!

Samantha: అదొక టాక్సిక్‌ రిలేషన్‌ షిప్‌.. సమంత కామెంట్స్‌ వైరల్!

Samantha: అదొక టాక్సిక్‌ రిలేషన్‌ షిప్‌.. సమంత కామెంట్స్‌ వైరల్!

Simhadri: ‘ఆది’ బ్లాక్ బస్టర్ అవ్వడం వల్లే ‘సింహాద్రి’ వచ్చిందట.. ఎలా అంటే?

Simhadri: ‘ఆది’ బ్లాక్ బస్టర్ అవ్వడం వల్లే ‘సింహాద్రి’ వచ్చిందట.. ఎలా అంటే?

Samantha, Raj: సమంత – రాజ్‌ షికార్లు.. ఇప్పుడు శ్యామాలి ఏం పోస్టు పెట్టారో చూశారా?

Samantha, Raj: సమంత – రాజ్‌ షికార్లు.. ఇప్పుడు శ్యామాలి ఏం పోస్టు పెట్టారో చూశారా?

Jr NTR, Mahesh Babu: అటు ఎన్టీఆర్.. ఇటు మహేష్… ఇద్దరూ ఆ ప్రామిస్ నిలబెట్టుకోవాలి!

Jr NTR, Mahesh Babu: అటు ఎన్టీఆర్.. ఇటు మహేష్… ఇద్దరూ ఆ ప్రామిస్ నిలబెట్టుకోవాలి!

trending news

Kanchana Collections: 14 ఏళ్ళ ‘కాంచన’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Kanchana Collections: 14 ఏళ్ళ ‘కాంచన’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

40 mins ago
Bhagyashri Borse: ‘మిస్టర్ బచ్చన్’ బ్యూటీకి టెస్టింగ్ టైం..!

Bhagyashri Borse: ‘మిస్టర్ బచ్చన్’ బ్యూటీకి టెస్టింగ్ టైం..!

1 hour ago
Ravi Teja: రవితేజపై ‘కలర్ ఫోటో’ దర్శకుడు సందీప్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Ravi Teja: రవితేజపై ‘కలర్ ఫోటో’ దర్శకుడు సందీప్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

1 hour ago
Lokesh Kanagaraj, Nagarjuna: నాగార్జున గురించి దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Lokesh Kanagaraj, Nagarjuna: నాగార్జున గురించి దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

2 hours ago
Genelia Interview: నా సినిమాలు చూసుకుని నేనే బాధపడే నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోలేదు – జెనీలియా దేశ్ముఖ్

Genelia Interview: నా సినిమాలు చూసుకుని నేనే బాధపడే నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోలేదు – జెనీలియా దేశ్ముఖ్

5 hours ago

latest news

Nagarjuna: నాగార్జున అసలైన గ్లామర్ సీక్రెట్ అదే..అలా చేయడం మన వల్ల కాదు లెండి..!

Nagarjuna: నాగార్జున అసలైన గ్లామర్ సీక్రెట్ అదే..అలా చేయడం మన వల్ల కాదు లెండి..!

55 mins ago
Pa Ranjith: స్టంట్‌ మ్యాన్‌ మృతి.. ఎట్టకేలకు స్పందించిన పా.రంజిత్‌!

Pa Ranjith: స్టంట్‌ మ్యాన్‌ మృతి.. ఎట్టకేలకు స్పందించిన పా.రంజిత్‌!

1 hour ago
విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన మరో నటి.. షాకింగ్ ఇది!

విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన మరో నటి.. షాకింగ్ ఇది!

1 hour ago
KRamp: మనోళ్లే ఇలాంటి టైటిల్స్ పెడుతుంటే.. డబ్బింగ్ సినిమాలకు మంచి పేర్లు ఎలా ఉంటాయి?

KRamp: మనోళ్లే ఇలాంటి టైటిల్స్ పెడుతుంటే.. డబ్బింగ్ సినిమాలకు మంచి పేర్లు ఎలా ఉంటాయి?

2 hours ago
Deepak: 24 ఏళ్ళ క్రితం దీపక్ డెబ్యూ మూవీ విషయంలో అంత జరిగిందా..?

Deepak: 24 ఏళ్ళ క్రితం దీపక్ డెబ్యూ మూవీ విషయంలో అంత జరిగిందా..?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version