‘నిన్నే పెళ్ళాడతా’ సినిమాలో నాగార్జునకీ.. అలాగే ‘మురారి’ సినిమాలో మహేష్ బాబుకి తల్లి పాత్రలో నటించిన లక్ష్మీ గురించి అందరికీ ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గతేడాది ఈమె ‘ఓ బేబీ’ , ‘మన్మథుడు2’ ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ వంటి సినిమాల్లో కూడా కీలక పాత్రలు పోషించింది. అప్పట్లో ఈమె కూడా పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సంగతి బహుసా చాలా మందికి తెలిసి ఉండదు. ‘లాహిరి లాహిరి లాహిరిలో’ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను..రజినీ కాంత్ ‘నరసింహా’ సినిమాలో సున్నితమైన తల్లి పాత్రను.. ఈమె ఎంతో ఈజ్ తో చేసేసింది.
‘పాత్ర ఎలాంటిది అయినా సరే వందకు వంద శాతం న్యాయం చేస్తుంది ఈ నటి అని అప్పటి స్టార్ డైరెక్టర్లు ఎంతో మంది ఈమె గురించి చెబుతుంటారు. అప్పట్లో ఈమె తక్కువ పారితోషికం తెచ్చిపెట్టే పాత్రలను కూడా చెయ్యను అని చెప్పేది కాదట. అలా అని ఈమెకు డబ్బులు తక్కువయ్యి కాదు.. ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకను కాదు..నటన పై ఈమెకు ఉన్న గౌరవం అలాంటిది. సెట్లో డైరెక్టర్ సీన్ వివరించేటప్పుడు.. మరింత ఆకర్షణ చేకూరిలా ఈమె మార్పులు చెప్పేదట. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ వంటి భాషల్లో ఈమె సినిమాలు చేసి అన్ని భాషల్లోనూ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక ఈమె పర్సనల్ లైఫ్ కూడా ఓ సంచలనమనే చెప్పాలి.
1969 లో భాస్కర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఈ నటి ఐదేళ్ళకే అంటే 1974 లోనే అతనితో విడాకులు తీసుకుని అందరికీ షాకిచ్చిందట. అటు తరువాత మోహన్ శర్మ అనే నటుడిని 1975లో పెళ్లి చేసుకుని.. మళ్ళీ ఐదేళ్ళు మాత్రమే అతనితో కాపురం చేసి 1980లో విడిపోయిందట ఈ నటి.! ఇక అటు తరువాత శివచంద్రన్ అనే దర్శకుడిని ఈమె 1987లో మూడో పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇలా మూడు సార్లు పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తడానికి కారణం ఎంటని.. ఈమెనే అడిగితే.. ‘నేను చెప్పిందే వినాలి, నువ్వు నాకంటే తక్కువ’ అనే అహంకారాన్ని భరించలేకపోవడం వల్లనే’ అంటూ ఈమె చెప్పుకొచ్చింది.