తెలుగు చిత్ర పరిశ్రమలో మినిమమ్ గ్యారంటీ సినిమాలు అందించే హీరోలుగా నాని, శర్వానంద్ పేరు దక్కించుకున్నారు. నాని వరుసగా ఏడు హిట్లు అందుకుంటే, శర్వానంద్ రన్ రాజా రన్ నుంచి అపజయాన్ని చూడలేదు. సంక్రాంతికి వచ్చిన శతమానం భవతి విజయంతో పాటు అవార్డులను సొంతం చేసుకుంది. కాబట్టి వీరితో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. నాని నిన్ను కోరి సినిమా తర్వాత రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో ఒకటి మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. మరో సినిమా కృషార్జున యుద్ధం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.
శర్వానంద్ రాధా సినిమా తర్వాత మంచి స్టోరీ కోసం ఎదురుచూస్తుండగా… హరీష్ శంకర్ చెప్పిన స్టోరీకి కనెక్ట్ అయినట్లు తెలిసింది. ఇందులో మరో హీరో కూడా నటించాల్సి ఉందని తెలిసినా శర్వానంద్ ఓకే చెప్పారంట. ఆ హీరోగా నానిని ఫిక్స్ చేసినట్లు తెలిసింది. ఈ ఇద్దరి హీరోలతో సినిమాలు నిర్మించిన దిల్ రాజు.. ఈ మల్టీ స్టారర్ సినిమాకి నిర్మాత బాధ్యతలు చేపట్టారు. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
