పోస్టర్‌తో సినిమా మీద అంచనాలు పెంచాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే పోస్టర్‌ను డీకోడ్ చేసి ఏకంగా కథనే ఊహించేస్తున్న జనాలున్నారు మరి. దీంతో పోస్టర్‌ను ఎంత కొత్తగా డిజైన్ చేస్తే.. సినిమా మీద క్రేజ్, హైప్ పెరగడం అంత ఈజీ అవుతుంది. దీనికి రీసెంట్ టైమ్స్‌లో నిలువెత్తు నిదర్శనం కావాలంటే శర్వానంద్ కొత్త సినిమా పోస్టర్ చూడాల్సిందే. శర్వా పుట్టిన రోజు సందర్భంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓ పోస్టర్‌ను లాంచ్ చేసింది. పెద్దగా వివరాలేవీ ఇవ్వకపోయినా.. ఏదో కొత్తగా అయితే డిజైన్ చేశారు అనిపిస్తుంది.
‘ఒకే ఒక జీవితం’ సినిమాతో ఎమోషనల్ విజయం అందుకున్న శర్వానంద్.. హిట్ కాన్సెప్ట్ అంటే ఏంటో తెలుసుకున్నట్లు ఉన్నాడు. తన తర్వాతి సినిమాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూనే కమర్షియల్ ఎలిమెంట్స్ తగ్గకుండా చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో రెగ్యులర్ స్టఫ్ కాకుండా కొత్తదనానికి విలువిస్తున్నాడు. అలా తన 35వ చిత్రంగా రాబోయే కాలానికి సంబంధించిన సినిమా చేస్తున్నాడట. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా పోస్టర్ బయటికొచ్చింది. ఆ పోస్టర్ చూస్తే.. వార్తాపత్రికలా కనిపిస్తోంది. పోస్టర్‌లో 51.5055° N, 0.0754 ° W కోఆర్డినేట్‌లు కనిపిస్తున్నాయి.
వాటి బట్టి చూస్తే.. బ్రిటన్‌లోని లండన్ లొకేషన్ అని తెలుస్తోంది. అంటే ఈ సినిమా బ్రిటన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది అని అర్థమవుతోంది. అంతేకాదు పోస్టర్‌లో శర్వానంద్ లుక్ చూస్తే.. క్యారెక్టర్ ఎంత క్రేజీగా ఉండబోతుందో తెలుస్తోంది. అయితే సినిమా కాన్సెప్ట్ ఎక్కడా, ఏ మాత్రం రివీల్ కాకుండా టీమ్ జాగ్రత్తపడింది. ప్రయోగాత్మక సినిమాలంటే శ్రీరామ్ ఆదిత్య ముందుంటారు.
అలా అని ఎప్పుడూ కమర్షియల్ ఎలిమెంట్స్ వదులుకోరు. అలాగా ప్రస్తుతం ఇండస్ట్రీలో విజయాలకు కేరాప్ అడ్రెస్గా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిలుస్తోంది. దీంతో ఈ సినిమా విషయంలో ఓకే చేసుకునేటప్పుడు అన్నీ చూసే ఉంటారు అని తెలుస్తోంది. అంతా ఓకే కానీ.. సినిమా ఎప్పుడు షురూ అంటారా? ఆల్ రెడీ మొదలైంది. అఫీషియల్‌గా కొబ్బరికాయ కొట్టకుండానే సినిమా స్టార్ట్ చేసి.. షూటింగ్ కూడా ఫుల్ స్వింగ్‌లో చేసేస్తున్నారు.