టాలీవుడ్ అతిపెద్ద విషాదాలలో ఉదయ్ కిరణ్ మరణం ఒకటి. చాల తక్కువ వయసులో ఉదయ్ ఆత్యహత్య చేసుకొని ప్రాణాలు విడిచాడు. అప్పట్లో సంచలనం రేపిన ఈ ఆత్మ హత్య వెనుకున్నది ఆర్ధిక కారణాలే అని ప్రముఖంగా వినిపించింది. ఒకప్పుడు చేతి నిండా సినిమాలు, సూపర్ హిట్స్, డబ్బులు, స్నేహితులతో హ్యాపీగా ఉన్న ఉదయ్ కిరణ్ కి సినిమా అవకాశాలు తగ్గి ఆర్ధికంగా చితికి పోవడం వలనే ఆయన సూసైడ్ చేసుకున్నారని కథనాలు రావడం జరిగింది. వాస్తవంగా కూడా అప్పటికే ఉదయ్ కిరణ్ సినిమా కెరీర్ ఒడిదుడుకులకు లోనవుతుంది.
ఆయన తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో ఇతర భాషలలో అడపా దడపా సినిమాలు చేయడం మొదలుపెట్టారు. కాగా ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి ఈ విషయాలను ఖండించారు. డబ్బులు లేక ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకున్నాడు అనేది నిజం కాదని అన్నారు. ఎందుకంటే ఉదయ్ కిరణ్ కి అప్పటికే చాలా ఆస్తులు ఉన్నాయి అన్నారు. ఉదయ్ కిరణ్ దగ్గర కోట్ల విలువైన ఆస్తులు, బంగారం ఉన్నాయి అన్నారు.
ఉదయ్ కిరణ్ మరణం తరువాత ఆ బంగారం; ఆస్తులు ఉదయ్ కిరణ్ భార్య విషిత తీసుకున్నారు అని శ్రీదేవి తెలిపారు. అలాగే ఆమెను ఎప్పుడు కలవాలన్న కుంటి సాకులు చెవుతూ తప్పించుకు తిరుగుతుంది అని ఆరోపణలు చేశారు. పరోక్షంగా ఉదయ్ కిరణ్ ఆత్మ హత్యకు కారణం భార్య విషిక అని చెప్పారు. 2000 లో తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్ అనతి కాలంలోనే భారీ ఇమేజ్ తెచ్చుకున్నారు. ఆయన 2014లో తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకున్నారు.