చిన్న సినిమాగా మొదలై పెద్ద సినిమా మారి.. ఇండస్ట్రీ హిట్ అయ్యి, ఆ తర్వాత ఏకంగా పాన్ ఇండియా హిట్‌గా మారిన సినిమాల లిస్ట్ రాస్తే.. అందులో తొలి స్థానాల్లో ‘కాంతార’ ఉంటుంది. పది కోట్ల రూపాయల బడ్జెట్ కూడా లేకుండా వందల కోట్ల రూపాయలు వసూళ్లు అందుకున్న సినిమా ఇది. సినిమా హిట్ అవ్వాలంటే అందులో పాన్ ఇండియా రేంజిలో హిట్ అవ్వాలంటే కంటెంట్‌తోపాటు ఎమోషన్స్ కూడా బాగా పండాలి అని నిరూపించిన సినిమా ఇది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాం అని మీరు అనుకుంటే.. ‘కాంతార 2’ కోసం అని చెప్పొచ్చు.
‘కాంతార’ రూ. 16 కోట్ల బడ్జెట్ నిర్మితమై దాదాపు రూ.400 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాకు కొనసాగింపుగా ‘కాంతార 2’ పట్టాలెక్కనుందని ఇదివరకే ప్రకటించారు. అయితే ఇప్పుడు ‘కాంతార 2’ ముందుగా అనుకున్నట్లు సీక్వెల్ కాదు అంటున్నారు. అలా అని పూర్తిగా కొత్త కథ కూడా కాదట. ‘కాంతార’కు కొత్త సినిమా ప్రీక్వెల్‌గా ఉంటుందట. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతల్లో ఒకరైన విజయ్ కిరగందూర్ తెలిపారు. ‘కాంతార 2’ కోసం ప్రణాళికలు సిద్ధం చేశాం. రిషబ్ శెట్టి ఇప్పటికే సినిమా పనులు మొదలుపెట్టారు అని తెలిపారు.
రెండో ‘కాంతార’ చిత్రీకరణ జూన్‌లో మొదలయ్యే అవకాశముంది. సినిమాలోని కొన్ని సన్నివేశాలు వర్షాకాలం నేపథ్యంలో ఉండబోతున్నాయి. అందుకే వర్షాకాలంలోనే సినిమా మొదలుపెట్టాలి అనుకుంటున్నాం. నిజంగా వర్షాల మధ్యలో ఆ సీన్స్ చేస్తే బాగుంటుంది అని మా ఆలోచన. అందుకే ఆ నెల నుంచే షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నాం. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలోనే రూపొంఇస్తాం. 2024 ఏప్రిల్ లేదా మేలో సినిమాను విడుదల చేస్తాం.
‘కాంతార’ కథ ప్రారంభమైందో ఈ సిమా అక్కడికి ముందు వరకు ఈ సినిమాలో కథ ఉంటుంది. అయితే సినిమాలో తొలి భాగంలోని నటులే ఉంటారా? కొత్త వాళ్లను తీసుకుంటారా అనేది మాత్రం చెప్పలేదు. మరికొద్ది రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుంది.