సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనే సంగతి మనకు తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది నటీమణులు అవకాశాల కోసం రావడం అవకాశాలు అందుకోవాలి అంటే ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతూనే ఉంటుంది. ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో తాము ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాము అంటూ క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విధంగా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు మాత్రమే కాకుండా సింగర్లు కూడా ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని సింగర్ ప్రణవి ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఉన్నటువంటి క్యాస్టింగ్ కౌచ్ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తన భర్త రఘు మాస్టర్ తో కలిసి ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సింగర్ ప్రణవి క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ కెరియర్ మొదట్లో తన గొంతు చాలా అద్భుతంగా ఉందని తనకు తమ సినిమాలో పాట పాడే అవకాశం కల్పిస్తామని దర్శకుడు తనని పిలిపించారు తాను కూడా వెళ్లగా ఆయన మాత్రం ఈ పాట పాడే అవకాశం రావాలి అంటే రాత్రి నా పక్కలోకి రావాలి అంటూ ఆయన మాట్లాడారని ప్రణవి తెలిపారు.
ఈ విధంగా ఆ వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడటంతో తనకు చాలా కోపం వచ్చిందని దాంతో ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే చెప్పు తెగేలా కొడతాను అంటూ బాగా వార్నింగ్ ఇచ్చే వచ్చానని ఈ సందర్భంగా ప్రణవి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను ఇతరుల విషయాల గురించి పెద్దగా పట్టించుకోను కానీ నా వరకు ఏదైనా వస్తే మాత్రం వారికి లెఫ్ట్ రైట్ ఇస్తాను అంటూ ఈ సందర్భంగా క్యాస్టింగ్ కౌచ్ పై ప్రణవి (Pranavi) చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.