బాహుబలి నటీనటుల గెటప్ లపై ప్రత్యేక ఫోటో షూట్
- December 13, 2016 / 11:20 AM ISTByFilmy Focus
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సినిమాలు అద్భుతంగా తీయడమే కాదు.. వాటికి ప్రచారం ఎలా చేయాలో తెలిసిన మహా మేధావి. సినిమాపై ప్రజల్లో అంచనాలు పెరిగేలా పబ్లిసిటీ డిజైన్ చేయడంలో జక్కన్నకు సాటి ఎవరూ లేరు. బాహుబలి బిగినింగ్ విషయంలో అతను పక్కా ప్లాన్ ప్రకారం ఒక్కొక్క పాత్రను రివీల్ చేశారు. వారి గురించి వివరిస్తూ ఆసక్తి కలిగించారు. అదే వ్యూహాన్ని బాహుబలి కంక్లూజన్ కి పాటించబోతున్నారు. ప్రచారానికి అవసరమయ్యే ఫోటోల కోసం ప్రత్యేక ఫోటో షూట్ ని ఈ వారంలో నిర్వహించనున్నారు. గురువారం సినిమాలోని కీలక నటీనటులందరూ రామోజీ ఫిలిం సిటీకి వచ్చి తమ పాత్రల రూపంలో ఫోటోలకు ఫోజులు ఇవ్వాల్సి ఉంటుంది.
ఇప్పటికే బాహుబలి 2 కి చెందిన షూటింగ్ ని పూర్తి చేసిన రాజమౌళి ఎడిటింగ్ దశలో అవసరమయ్యే కొన్ని షాట్స్ ని చిత్రీకరిస్తున్నారు. ప్రొడక్షన్ టీమ్ మొత్తానికి ఈ నెల 27 న పేకప్ చెప్పి, 31 వ తేదీ అర్ధరాత్రి పెద్ద పార్టీ ఇచ్చి అందరిని విడుదల చేయనున్నారు. ఆ తర్వాత జక్కన్న పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీకానున్నారు. ఆ పనులను కూడా తొందరగా కంప్లీట్ చేసి ప్రపంచవ్యాప్తంగా పబ్లిసిటీ కార్యక్రమంలో జోరుగా పాల్గొనాలని భావిస్తున్నారు. ఏప్రిల్ 28న విడుదల కానున్న ఈ మూవీకోసం సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















