బిగ్ బాస్ హౌస్ లో ఐదోవారం హౌస్ వేడెక్కిపోయింది. నామినేషన్స్ కంటే కూడా జెస్సీ కిచెన్ చపాతీల ఇష్యూ అనేది మంటలు రేపింది. ఇక్కడే జెస్సీ తరపున వకాల్తా పుచ్చుకుని షణ్ముక్ ఇంకా సిరిలు వచ్చారు. జెస్సీ కెప్టెన్ గా ఉన్నప్పుడు శ్రీరామ్ కిచెన్ లో కావాలంటే హమీదాకి ఇచ్చాడు అంటూ సిరి లాజిక్ మాట్లాడింది. అప్పుడు కంఫోర్ట్ జోన్ లో ఉన్నప్పుడు , ఇప్పుడు ఎందుకు ఆర్డర్స్ వేస్తున్నారు అంటూ మాట్లాడింది. షణ్ముక్ తన ఫ్రెండ్ కోసం గట్టిగా స్టాండ్ తీస్కునే హక్కు నాకుంది అంటూ మాట్లాడాడు. అలాగే, నా రూల్ బుక్ లో విన్నవాళ్లే మాట్లాడాలని రూల్ లేదు అంటూ చెప్పాడు.
ఇద్దరి మద్యలో మాటలయుద్ధం జరుగుతున్నప్పుడు సిరి కూడా శ్రీరామ్ పై విరుచుకుపడింది. నువ్వెవరు నాకు చెప్పడానికి అనేంత వరకూ ఇష్యూ అయ్యింది. దీంతో శ్రీరామ్ హౌస్ మేట్స్ తింటేనే నేను కూడా తింటాను అంటూ కన్ క్లూజన్ ఇచ్చి వెళ్లాడు. ఈవిషయంలో శ్రీరామ్ చంద్ర కరెక్ట్ గానే ఉన్నాడు. లాస్ట్ టైమ్ జెస్సీ జైల్ కి వెళ్లినపుడు కూడా నేను అతను తిన్నాకే తిన్నాను అంటూ గుర్తుచేశాడు. హమీదాని భోజనం చేయమని, నేను వాళ్లు తిన్నాకే తింటానని క్లారిటీగా ఉన్నాడు శ్రీరామ్.
ఇక షణ్ముక్ జెస్సీ చేసిన పనికి శ్రీరామ్ తో గొడవకి దిగాడు. నువ్వు వర్క్ చేయను అనడం తప్పు అని జెస్సీకి చెప్పాడు. అలాగే శ్రీరామ్ కి మీరు ఫుడ్ పెట్టను అని ఎలా అంటారు.. ఎవరిని వారు వండుకుని తినమని ఎలా అంటారు ఆ స్టేట్మెంట్ తప్పు అని చెప్పాడు. దానికి నేను జెస్సీ తరపున స్టాండ్ తీస్కుంటున్నా అన్నాడు. నిజానికి శ్రీరామ్ చంద్ర కిచెన్ లో వర్క్ చేసే విషయంలో జెస్సీతో అంతకుముందే మాట్లాడాడు. దానికి ఓకే అని చెప్పి మరీ వెళ్లాడు జెస్సీ. ఆ తర్వాత చపాతీలు రోల్ చేద్దుకానీ రా అని పిలిస్తే నాకు రాదు అంటూ జెస్సీ అక్కడ్నుంచీ వెళ్లాడు. అక్కడే శ్రీరామ్ కి జెస్సీ చేసింది నచ్చేలేదు. నీకు రాకపోతే నేను నేర్పిస్తాను నేర్చుకో అంటూ మాట్లాడాడు. ఇద్దరి మద్యలో గట్టి ఆర్గ్యూమెంట్ అయ్యింది.
ఈవిషయంలో సిరి – షణ్ముక్ ఇద్దరూ జెస్సీ తరుపున బలంగా మాట్లాడారు. నైట్ అంతా ఫుడ్ తినడం కూడా మానేసి మరీ ఈవిషయంపై స్టాండ్ తీస్కున్నారు ఇద్దరూ. కెప్టెన్ గా శ్రీరామ్ చంద్ర చెప్పిన పని జెస్సీ చేయాల్సింది. తను కెప్టెన్ గా ఉన్నప్పుడు స్ట్రిక్ట్ గా లేడు కాబట్టే అందరూ జెస్సీ కెప్టెన్సీలో ఆడుకున్నారు. అందుకే శ్రీరామ్ చంద్ర జెస్సీని వర్క్ చేయమని పిలిచాడు. ఈ విషయంలో శ్రీరామ్ చంద్ర క్లియర్ గానే ఉన్నాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా వచ్చిన సిరి – షణ్ముక్ లు లాజిక్స్ వర్కౌట్ చేయాడానికి చూశారు. అదీ విషయం.