హీరోలకంటే ఒక ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికే తెగ ఇబ్బందిపడుతుంటారు కానీ.. హీరోయిన్లు మాత్రం ఒక్క బాషలో క్లిక్ అయ్యారంటే మాత్రం అన్నీ భాషల నుండీ ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చేస్తాయి. ముఖ్యంగా బాలీవుడ్ భామలకైతే మన సౌత్ ఇండస్ట్రీ ఎప్పుడు అగ్ర తాంబూలమే ఇస్తుంది. అయితే.. ఆ బాలీవుడ్ భామలు కూడా చాలా తక్కువగా క్లిక్ అవుతుంటారు. రకుల్, పూజా హెగ్డేలు కూడా ముంబై బ్యూటీలే. ఆఖరికి కత్రినా కైఫ్ కూడా బాలీవుడ్ లో అవకాశాల్లేక అల్లల్లాడుతున్న తరుణంలో టాలీవుడ్ లో వరుసగా రెండు ఆఫర్లు ఇచ్చి ఆమెకు స్టార్ డమ్ తెచ్చిపెట్టింది తెలుగు సినిమా.
అందుకే అక్కడి హీరోయిన్లందరూ మంచి ప్రొజెక్ట్ దొరకాలే కానీ సైన్ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారు. అయితే.. తెలుగు సినిమాలో గ్రోత్ ఉండదనుకొని పొరబడిందో లేక మరింకేదైనా కారనమో తెలియదు కానీ.. శ్రీదేవి కుమార్తె జాన్వికపూర్ కు పలుమార్లు టాలీవుడ్ నుంచి పిలుపు వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. నిజానికి ఇస్మార్ట్ శంకర్, ఫైటర్ చిత్రాల్లో పూరీ జగన్నాధ్ తొలుత హీరోయిన్ గా జాన్వి కపూర్ నే అనుకున్నాడు. ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేను అని ఆఫర్ రిజక్ట్ చేయడంతో వేరే వాళ్ళని తీసుకొన్నాడు.
ఇప్పుడు బాలీవుడ్ లో జాన్వి కపూర్ కి ఆశించిన స్థాయి స్టార్ డమ్ దక్కకపోవడం, తాను నటించిన సినిమాలన్నీ ఒక్కోటిగా నెట్ ఫ్లిక్స్ లోనే విడుదలవుతుండడంతో బాలీవుడ్ ను మాత్రమే నమ్ముకుంటే తన కెరీర్ ముందుకు సాగదని గ్రహించి.. బాలీవుడ్ సూపర్ స్టార్ దీపిక పడుకొనే కూడా తెలుగు సినిమా సైన్ చేయడాన్ని స్ఫూర్తిగా తీసుకొని అర్జెంట్ గా టాలీవుడ్ ఆఫర్ల కోసం ప్రయత్నాలు మొదలెట్టింది జాన్వి. మరి రామ్ చరణ్ ఆమెకు అవకాశం ఇస్తాడేమో చూడాలి.