ఈ మధ్య కాలంలో ప్రెగ్నెన్సీ వార్తలు ఎక్కువగానే వింటున్నాం. హిందీ సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన దీపికా కక్కర్.. కెరీర్ ప్రారంభంలో జెట్ ఎయిర్ వేస్ సంస్థలో ఎయిర్ హూస్టెస్ గా పనిచేసేది. మూడేళ్ల పాటు ఆమె అక్కడ పనిచేసింది. అయితే అనారోగ్య సమస్యల కారణంగా గుడ్ బై చెప్పేసింది. తర్వాత మోడల్ గా కెరీర్ ను ప్రారంభించింది.అలాగే నటిగా కూడా రాణించాలని నటనపై దృష్టి పెట్టింది. హిందీలో పాపులర్ సీరియల్ గా పేరొందిన ‘ససురాల్ సిమర్ కా’ ద్వారా దీపికా కక్కర్ మంచి గుర్తింపు సంపాదించుకుంది.
అటు తర్వాత పలు రియాలిటీ షోలలో కూడా పాల్గొంది. ‘పల్టాన్’ మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో తన సహ నటుడు షోయబ్ ఇబ్రహీంని లవ్ చేసి పెళ్లి చేసుకుంది. షోయబ్ ముస్లిం కావడంతో దీపిక కూడా మతం మార్చుకుని తన పేరును ఫైజా గా మార్చుకోవడం జరిగింది. అయితే పెళ్ళైన 5 ఏళ్లకు ఆమె గర్భం ధరించింది. ఈ విషయాన్ని ఆమె షేర్ చేసుకుంటూ ఓ షాకింగ్ విషయాన్ని తెలిపింది.
దీపికా కక్కర్ (Actress) మాట్లాడుతూ.. ‘ఇప్పుడు నేను గర్భవతిని. తల్లిని కాబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. పెళ్లైన ఐదేళ్ల తర్వాత మేము తల్లిదండ్రులం కాబోతున్నాం. ఈ ఆనందం మాటల్లో చెప్పలేనిది. చిన్నవయసులోనే నేను కెమెరా ముందు నటించాను. 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. నా ప్రెగ్నెన్సీ వార్త నా భర్త షోయబ్ కు చెప్పగానే ఆయన కళ్లలో ఆనందం చూశాను. ఇప్పుడు నాకు పని చేయడం ఇష్టం లేదు. నటనకు గుడ్ బై చెప్పి.. ఒక తల్లిగా, భార్యగా జీవితాన్ని గడపాలని భావిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.