బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘క్వీన్’ ని సౌత్ లోని అన్ని భాషల్లో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్, కన్నడంలో పరుల్ యాదవ్, మలయాళంలో మంజిమా మోహన్.. వంటి స్టార్ హీరోయిన్లతో క్వీన్ రీమేక్లను తెరకెక్కించారు.షూటింగ్ కంప్లీట్ అయ్యింది. టీజర్లు రిలీజ్ అయ్యి 5 ఏళ్ళు కావస్తోంది.అయినా ఈ సినిమాలు రిలీజ్ అయ్యింది. తెలుగులో ‘దటీజ్ మహాలక్ష్మీ’ పేరుతో తమన్నాతో ఈ చిత్రాన్ని రూపొందించారు.
ఆమె (Tamanna) నటించిన ‘లస్ట్ స్టోరీస్’ ‘జీ కర్దా’ వంటి కొత్త సిరీస్ లు కూడా రిలీజ్ అయ్యాయి. కానీ ‘దటీజ్ మహాలక్ష్మీ’ ఇంకా రిలీజ్ కాలేదు. థియేట్రికల్ బిజినెస్ సరిగ్గా జరగకపోవడం వల్లే ఈ చిత్రం విడుదల కాలేదు అంటూ అప్పట్లో పుకార్లు నడిచాయి. వాటి పై టీం క్లారిటీ ఇచ్చింది లేదు. లాక్ డౌన్ టైంలో ఓటీటీల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నా.. మేకర్స్ ఆ దిశగా అడుగులు వేసింది లేదు. ఆ విషయాన్ని పక్కన పెడితే..
‘క్వీన్’ తెలుగు రీమేక్ ని మొదటిగా టేకాఫ్ చేసిన దర్శకుడు నీలకంఠ. కానీ తర్వాత ఆయన ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకోవడం జరిగింది. ప్రశాంత్ వర్మ ఈ రీమేక్ ను ఫినిష్ చేయడానికి ముందుకు వచ్చాడు. అయినా టైటిల్స్ లో నీలకంఠకి క్రెడిట్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ‘సర్కిల్’ ప్రమోషన్స్ లో ‘దటీజ్ మహాలక్ష్మీ’ గురించి ప్రశ్నిస్తే.. ‘దయచేసి ఆ సినిమా గురించి నా దగ్గర మాట్లాడకండి’ అంటూ ఆయన కొంచెం అసహనం వ్యక్తం చేశారు.