మన జీవితాల్లో ఎదురైనా కొన్ని అనుభవాలను చూసి అదంతా ఉత్తదే అని కొట్టిపారేస్తూ ఉంటాం. కానీ కొంతమందిని చూసినప్పుడు మాత్రం అది నిజమే అని అనిపిస్తాది. అలాంటి గొప్ప మనుషులలో ఒకడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా, ఒక బస్సు కండక్టర్ గా జీవితాన్ని గడుపుతున్న ఆయన, సినిమాల్లో అవకాశాలు సంపాదించి, చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ, ఆ తర్వాత హీరో గా మారి, పెద్ద రేంజ్ కి ఎదిగి ఎన్నో సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ ని అందుకొని సూపర్ స్టార్ గా ఎదిగాడు.
ఈయన సినిమా వస్తుందంటే చాలు ప్రపంచం లో ఉన్న దేశాలు మొత్తం క్యూ కట్టేస్తాయి. హిట్ ఫ్లాప్ మరియు వయస్సు తో ఏమాత్రం సంబంధం లేని ఏకైక ఇండియన్ సూపర్ స్టార్ ఆయన. ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం ఉన్న మనిషి ఆయన. తాను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సహాయం చెయ్యడానికి ఉపయోగిస్తూ ఉంటాడు రజినీకాంత్. తన తర్వాత తన అతి మొత్తం అనాధ శరణాలయాలకు మాత్రమే చెందాలి అని వీలునామా రాసిన ఏకైక మనిషి ఆయన.
ఇకపోతే ఆయనది ఎంత మంచి మనస్సు అని చెప్పడానికి మరో ఉదాహరణ ని తీసుకోవచ్చు. ఈ క్రింది ఫొటోలో కనిపిస్తున్న ముసలాయన రజినీకాంత్ కి తండ్రి. కానీ ఆయన సొంత తండ్రి మాత్రం కాదు, రజినీకాంత్ దత్తత తీసుకున్న తండ్రి అన్నమాట. ఆయన పేరు పలం కల్యాణ సుందరం.
ఎవరు లేని అనాధగా జీవితం ని గడుపుతున్న సుందరం ని చూసి రజినీకాంత్ మనస్సు చెలించిపోయింది. అంతే కాదు అతను పడిన కష్టాలను విని రజినీకాంత్ తన సొంత తండ్రిని గుర్తు చేసుకున్నాడు. అందుకే అప్పటి నుండి ఆయన పలం కల్యాణ సుందరం ని దత్తత తీసుకున్నాడు. ప్రస్తుతం ఆయన రజినీకాంత్ (Star Hero) ఇంట్లోనే ఉంటున్నాడు.