తొలి భారతీయ స్వాతంత్ర సమర యోధుడు రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవితం ఆధారంగా రూపుదిద్దుకోనున్న సైరా నరసింహారెడ్డి సినిమా పనులు జోరందుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి గుర్రపు స్వారీ, కత్తి విన్యాసాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. డైరక్టర్ సురేందర్ రెడ్డి స్క్రిప్ట్ లాక్ చేసే పనిలో ఉన్నారు. ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ హైదరాబాదలోని నానక్ రామ్ గూడా స్టూడియోస్ లో ప్రత్యేక సెట్ వేస్తున్నారు. 1840 ల నాటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. మరో పది రోజుల్లో ఈ సెట్ కంప్లీట్ కానుంది. అక్టోబర్ 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు.
ఈ సెట్లో కొన్ని కీలక సీన్లు తెరకెక్కించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ లో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సినిమా రారాజు అమితాబ్ బచ్చన్, డేరింగ్ స్టార్ జగపతి బాబు, కన్నడ స్టార్ కిచ్చ సుదీప్, విజయ్ సేతు పతి లు కీలక పాత్రలు పోషించనున్నారు. ఖైదీ నంబర్ 150 సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.