సాధారణంగానే చిరంజీవి సినిమాలంటే మెగా అభిమానులు, నందమూరి అభిమానులు, సూపర్ స్టార్ అభిమానులు అన్న తేడా లేకుండా అన్నీ వర్గాల ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. 60 ఏళ్ళు పైబడినా కూడా “ఖైదీ నం.150” కోసం చిరంజీవి చేసిన డ్యాన్సులు, ఫైట్లు ప్రేక్షకుల్ని ఏ రేంజ్ లో ఆకట్టుకొన్నాయో ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అటువంటి గిగాంటిక్ హిట్ అనంతరం చిరంజీవి నటిస్తున్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా “సైరా నరసింహారెడ్డి”. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఎపిక్ ఫిలిమ్ మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలున్నాయి. రేపు చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకొని ఇవాళ టీజర్ ను విడుదల చేశారు.
1880 నేపధ్యంలో మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ తోనే సినిమా మీద అంచనాలను విశేషంగా పెంచేశాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. రామ్ చరణ్ ప్రొడక్షన్ వేల్యూస్, రత్నవేలు సినిమాటోగ్రఫీ విశేషంగా ఆకట్టుకొంటాయి. ముఖ్యంగా.. ఉగ్ర నరసింహుడిలా కనిపిస్తున్న ఉయ్యలవాడ నరసింహారెడ్డి అలియాస్ కొణిదెల కొదమసింహం చిరంజీవి నటవిశ్వరూపం ఈ చిత్రంతో నవతరం ప్రేక్షకులకి పరిచయమవ్వడం ఖాయమని చిరు అభిమానులు భావిస్తుండగా.. ట్రేడ్ విశ్లేషకులు మాత్రం “సైరా నరసింహారెడ్డి” చిత్రం చిరంజీవి కెరీర్ లో మాత్రమే కాదు తెలుగు సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంలో సందేహం లేదని విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. ఏదేమైనా.. కధనరంగంలో కొదమ సింహంలా కనిపిస్తున్న కొణిదెల వీరుడ్ని చూడడం ఎంత ముచ్చటగా ఉందో.. సినిమా ఎప్పుడు విడుదలవుతుందా? ఎప్పుడెప్పుడు చిరంజీవిని నరసింహా రెడ్డిగా చూద్దామా అని అభిమానులు వెయిటింగ్.