తొలి అడుగు ఎవరికైనా మధురంగానే ఉంటుంది. ఎంత ఎత్తుకు వెళ్లినా మొదటి ప్రయత్నాన్ని మరచిపోలేము. భారతీయ గర్వించ దగ్గ సినిమా తీసిన ఎస్.ఎస్.రాజమౌళి మొదటి చిత్రం ‘స్టూడెంట్ నెం.1’ రీలిజ్ అయింది ఈ రోజే. అందుకే ఆనాటి జ్ఞాపకాలను దర్శకదీరుడు ఈరోజు గుర్తుచేసుకున్నారు. చిత్రం విడుదలై 15 ఏళ్ళు అవుతున్నా తనకి ఆలా అనిపించడం లేదని జక్కన్న పోస్ట్ చేశారు. ఈ చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ ని విజయ పథంలోకి నడిపింది. అందుకే తారక్ కూడా స్పందించారు.
స్టూడెంట్ నెం.1 రోజులను గుర్తు చేసుకున్నారు. “అప్పుడే తన సినిమా మొదలుపెట్టిన ఓ కొత్త దర్శకుడి నుండి ఇండియన్ సినిమాలో టాప్ డైరెక్టర్స్‌లో ఒకరుగా నిలిచే స్థాయికి వచ్చిన రాజమౌళి పదిహేనేళ్ళ ప్రయాణం. ఓ 19 ఏళ్ళ కుర్రాడి నుండి ఇప్పుడో తండ్రిగా ఎదిగిన నా ప్రయాణం. ఇదంతా ఓ మరచిపోలేని అనుభూతి.
ఇన్నేళ్ళలో చెక్కుచెదరినిది మా స్నేహమే” అంటూ రాజమౌళితో తన స్నేహం గురించి ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే ‘స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ వంటి మూడు సూపర్ హిట్స్ వచ్చాయి. మళ్లీ తారక్, జక్కన్న కలిసి ఎప్పుడు సినిమా తీస్తారా? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
15 long years.but what remains the same is our friendship which started with STUDENT NO-1