బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ ఎవరో తెలిసిపోయింది. ఇప్పటివరకూ జరిగిన ఓటింగ్ ప్రకారం చూస్తే ఈసీజన్ కి సన్నీనే విన్నర్ అవుతాడని పబ్లిక్ ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే, మునుపెన్నడూ జరగని విధంగా సోషల్ మీడియాలో అన్ అఫీషియల్ పోలింగ్ లో సన్నీకి భారీగా ఓట్లు వస్తున్నాయి. దాదాపుగా 50శాతం మించి ఓటింగ్ అనేది జరుగుతోంది. దీంతో నెటిజన్స్ , బిగ్ బాస్ వ్యూవర్స్ అందరూ కూడా సన్నీనే విన్నర్ అవుతాడని మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు.
కానీ, రేస్ లో షణ్ముక్ జస్వంత్, ఇంకా శ్రీరామ్ చంద్ర ఇద్దరూ ఉన్నారు. అయితే, వీరిద్దరి పొజీషన్స్ ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎవర్ని రన్నరప్ చేస్తారు ? ఎవర్ని మూడో పొజీషన్ లో ఎలిమినేట్ చేస్తారు అనేది ఇంట్రస్టింగ్ పాయింట్. లాస్ట్ సీజన్ లో అభిజీత్ ఇంకా అఖిల్ సార్ధక్ ఇద్దర్నీ స్టేజ్ పైకి తీస్కుని వచ్చిన నాగార్జున అభిజీత్ ని విన్నర్ గా ప్రకటించాడు. అయితే, ఈసారి స్టేజ్ పైకి ఏ ఇద్దర్నీ తీస్కుని వస్తాడు అనేది చాలా ఆసక్తికరంగా మారింది.
నిజానికి శ్రీరామ్ చంద్రకి ఉన్న క్రేజ్ కి విన్నర్ అవ్వాల్సింది. కానీ, గేమ్ లో ఎగ్రెసివ్ నెస్, సన్నీ డామినేషన్ వల్ల వెనకబడ్డాడు. అలాగే సోషల్ మీడియాలో అస్సలు ఫాలోయింగ్ లేకపోవడం అనేది కూడా శ్రీరామ్ కి ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గింది. కానీ, అఫీషియల్ ఓటింగ్ అనేది ఎలా వస్తోంది అనేది తెలియదు. కాబట్టి, షణ్ముక్ కి సెకండ్ పొజీషన్ ఇస్తారా ? లేదా శ్రీరామ్ ని రన్నర్ చేస్తారా అనేది ఆసక్తికరం.
బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గా మాత్రం సన్నీనే చేస్తారని ఫిక్స్ అయిపోయారు అందరూ. అయితే, ఇక్కడ బిగ్ బాస్ టీమ్ ఏదైనా చేయచ్చు. ఇంకా మూడు రోజులు ఓటింగ్ ఉంది కాబట్టి, షణ్ముక్ జస్వంత్ , శ్రీరామ్ చంద్రకి హ్యూజ్ గా ఓటింగ్ వస్తే వీరిద్దరిలో ఒకరికి టైటిల్ కట్టబట్టే అవకాశం కూడా లేకపోలేదు. మరి చూద్దాం.., పబ్లిక్ ప్రిడిక్షన్ అనేది కరెక్ట్ గా ఉంటుందా లేదా అనేది.