ఒక సినిమా రిజల్ట్ వెనుక చాలా కారణాలుంటాయి. హిట్టుకైనా కాస్త తక్కువ కారణాలుండచ్చెమో కానీ ఫెయిల్యూర్ కి మాత్రం లెక్కలేనన్ని కారణాలుంటాయి. గత శుక్రవారం విడుదలైన “చెక్” డిజాస్టర్ వెనుక కూడా ఇలాగే చాలా కారణాలున్నాయి. అందులో ముఖ్యమైనది చంద్రశేఖర్ ఏలేటి ఇమేజ్. ఏలేటి హిట్ సినిమా తీస్తాడా, ఫ్లాప్ సినిమా తీస్తాడా అనే విషయాన్ని ప్రేక్షకులు అస్సలు పట్టించుకోరు. ఆయన దర్శకత్వంలో సినిమా వస్తే చాలు థియేటర్ల ముందు బారులు తీరిపోతారు ప్రేక్షకులు.
ఏలేటి సినిమా అంటే కొత్తదనం ఆశిస్తారు జనాలు. ఆ ఇమేజ్ & అంచనాలు “చెక్” సినిమా రిజల్ట్ కి చెక్ పెట్టాయి. ప్రేక్షకులు “చెక్” సినిమాకి ఆల్రెడీ ఒక మైండ్ సెట్ తో వచ్చారు. అందులోని ఏలేటి సినిమాలు నచ్చే ఆడియన్స్ అంటే ప్రపంచ సినిమాపై అవగాహన ఉన్నవారు. అప్పటివరకూ ఏలేటి తీసిన సినిమాలన్నీ హాలీవుడ్ స్థాయిలో ఉండి “చెక్” ఏమో హాలీవుడ్ సినిమాలు, సిరీస్ ల నుండి స్పూర్తి పొందినట్లుగా ఉండడంతో ఏలేటి ఫ్యాన్స్ హతాశులయ్యారు.
సొ, ఆదిత్యగా నితిన్ పెర్ఫార్మెన్స్ ఎంత బాగున్నా.. వారాంతంలో కేవలం 7.66 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. సినిమా బిజినెస్ 16 కోట్లు. అంత మొత్తాన్ని షేర్ గా రాబట్టాలంటే సెకండ్ వీక్ కలెక్షన్స్ చాలా ముఖ్యం. అయితే.. ఈ శుక్రవారం కూడా బోలెడు సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉండడంతో కలెక్షన్ దాదాపుగా కష్టమే అని తెలుస్తోంది.