బిగ్ బాస్ హౌస్ లో సండే ఫన్ డే అయిపోగానే అసలైన రచ్చ మొదలవుతుంది. సోమవారం నామినేషన్స్ లో హౌస్ హీటెక్కిపోతుంది. ఒకరినొకరు దెప్పుకుంటూ, తిట్టుకుంటూ, వాళ్ల చేష్టలని చెప్తూ నామినేట్ చేసుకుంటారు. ఓపెన్ నామినేషన్స్ లో ఇది ఎప్పుడూ జరిగే వ్యవహారమే. అయితే, ఈసారి బిగ్ బాస్ హౌస్ లో 2వ వారం రెండు గ్రూప్స్ గా విడిపోయిన హౌస్ మేట్స్ నామినేషన్స్ లో పార్టిసిపేట్ చేసినట్లుగా తెలుస్తోంది. రెండోవారం నామినేషన్స్ హౌస్ లో పూర్తి అయ్యాయి.
ఇక్కడే హౌస్ మేట్స్ లో మొత్తం ఈసారి 7గురు నామినేషన్స్ లోకి వచ్చారు. రెండోవారం నామినేషన్స్ లో ప్రియా, ప్రియాంక సింగ్, ఉమాదేవి, కాజల్, లోబో, నటరాజ్ , ఇంకా అనీమాస్టర్స్ ఉన్నారు. మరి వీళ్లలో ఎవరు ఎన్ని ఓట్లు సాధిస్తారు అనేది ఆసక్తికరం. నిజానికి నామినేషన్స్ లో చూస్తే ఈసారి జెస్సీ , లహరి ఇద్దరూ కూడా ఉంటారనే ఎక్స్ పెక్ట్ చేశారు. అంతేకాదు, హమీదా వచ్చినా కూడా డేంజర్ జోన్లోనే ఉండేది. ఫస్ట్ వీక్ లో సరయు కంటే కొన్ని ఓట్ల తేడాతో హమీద బతికిపోయింది.
లేదంటే హమీదా ఫస్ట్ వీక్ వెళ్లిపోయి ఉండేదే. ఇప్పుడు కూడా హమీద, జెస్సీ, లహరిలు నామినేషన్స్ లో లేరు. అలాగే, విశ్వ, రవి, శ్రీరామ్, షణ్ముక్ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కూడా నామినేషన్స్ లో లేరు. హౌస్ లో ఇప్పుడు ప్రస్తుతం 18మంది ఉన్నారు వీరిలో 7గురు రెండోవారం నామినేషన్స్ లోకి వచ్చారు. ఇక్కడ మరి డబుల్ ఎలిమినేషన్ చేస్తే మాత్రం ఇద్దరికి డేంజర్ అనే చెప్పాలి. ఒకవేళ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే మాత్రం నో ఎలిమినేషన్ కూడా జరిగి అవకాశం కనిపిస్తోంది.