బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో ఓటీటీలో నాలుగోవారం ఎలిమినేషన్ అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చెప్పలేని పరిస్థితిగా మారింది. రోజుకి ఒకరు ఓటింగ్ లో లీస్ట్ లో టెన్షన్ పెడుతున్నారు. అన్ అఫీషియల్ పోలింగ్స్ చూస్తుంటే ఈసారి మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారా…, ఫిమేల్ కంటెస్టెంట్ అవుతారా అనేది ఇప్పుడు ఆసక్తికరం. ఇక ఒక్కసారి మనం ఓటింగ్ ని చూసినట్లయితే.,
ఓటింగ్ లో టాప్ లో ఉంది బిందుమాధవి దాదాపుగా 27శాతం ఓటింగ్ లో దూసుకుపోతోంది. లాస్ట్ టైమ్ అఖిల్ కి టఫ్ ఫైట్ ఇచ్చిన బిందుమాధవి తన ఓటింగ్ పర్సెంటేజ్ ని పెంచుకుంటూ వెళ్తోంది. ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా ఈసారి టఫ్ ఫైట్ బిగ్ బాస్ లవర్స్ చూడబోతున్నారనే చెప్పాలి. ఇక నెక్ట్స్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు యాంకర్ శివ. యాంకర్ శివ కూడా దాదాపుగా 22 శాతం ఓటింగ్ ని తెచ్చుకున్నాడు సేఫ్ జోన్ లోనే ఉన్నారు. వీరిద్దరి తర్వాత అరియానా, అజయ్ వీరిద్దరూ ఉన్నారు.
వీరిద్దరూ కలిపి 28 పర్సెంటేజ్ వరకూ ఓటింగ్ ని తెచ్చుకున్నారు. సేఫ్ జోన్ లోనే ఉన్నారు. అయితే, అరియానా మాత్రం కొన్ని సైట్స్ లో అజయ్ ని బీట్ చేయలేకపోయింది. అజయ్ కి 16శాతం వరకూ ఓటింగ్ జరిగితే, అరియనాకి 12శాతం వరకే జరిగింది. చివరి రెండు రోజులు బాగా వెనకబడిపోయిందనే చెప్పాలి. ఆ తర్వాత సరయు కూడా ఈసారి సేఫ్ జోన్ లోనే ఉంది. ఇక మిగిలింది ఇద్దరే ఇద్దరు. వారిలోనే ఎలిమినేషన్ అనేది జరుగుతుంది.
మిత్రాశర్మా ఇంకా అనిల్ రాధోడ్ వీరిద్దరిలోనే ఒకరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. అయితే, ఎవరు ఎలిమినేట్ అవుతారు ? ఈసారి మేల్ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేస్తారా ? లేదా ఫిమేల్ కంటెస్టెంట్ ని చేస్తారా అనేది ఆసక్తికరం. అనిల్ రాధోడ్ కెప్టెన్సీ పైన హౌస్ మేట్స్ సైతం అసహనంగా ఉన్నారు. అలాగే కంటెంట్ విషయంలో కూడా తను వెనకబడే ఉన్నాడు. మరి ఇలాంటి సందర్భంలో అనిల్ రాధోడ్ ని ఎలిమినేట్ చేస్తారనే అనిపిస్తోంది.
ఇక అనిల్ రాథోడ్ ఎలిమినేట్ అయితే ఇద్దరు ఫిమేల్ కంటెస్టెంట్స్ , ఇద్దరు మేల్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయినట్లుగా అవుతుంది లెక్క సరిపోతుంది. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది.