టాలెంటెడ్ యాక్టర్ కమ్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ నందమూరి కళ్యాణ్ రామ్ మరికొద్ది రోజుల్లో ‘అమిగోస్’ అనే డిఫరెంట్ మూవీతో ప్రేక్షకాభిమానుల ముందుకు రాబోతున్నాడు. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఆయన మూడు విభిన్నమైన పాత్రలలో త్రిపాత్రాభినయం చేశాడు. ‘బింబిసార’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తుండడం, పైగా ట్రిపుల్ రోల్ చేయడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫిబ్రవరి 10న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్..
రాజేంద్ర రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ మూవీతో ఆషిక రంగనాథ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.. ‘అమిగోస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అతిథిగా వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ముందుగా దర్శకుడి గురించి మాట్లాడడం విశేషం. ఇంజనీరింగ్ చేసిన రాజేంద్ర రెడ్డి ఎంతో ఇష్టంతో ఇండస్ట్రీలోకి రావడం.. ఈ చిత్రం చేస్తుండగా తల్లిదండ్రుల్ని కోల్పోవడం వంటి విషాద సంఘటనల గురించి చెప్పి.. ఆయన ఈ ఎంత ప్యాషన్‌తో ఈ సినిమాని తెరకెక్కించి ఉంటారో ఊహించుకోండి అన్నట్టు హింట్ ఇచ్చారు.
ఇదిలా ఉంటే.. ‘అమిగోస్’ కథ కళ్యాణ్ రామ్ – మైత్రీ మూవీస్ వద్దకు వెళ్లడానికి ముందు డైరెక్టర్ చాలానే కష్టాలు పడ్డాడని అంటున్నారు. ముందుగా ఒక హీరోతో అనుకుని తర్వాత జరిగే పరిణామాలు, పరిస్థితుల కారణంగా ప్రాజెక్ట్స్ పట్టాలెక్కకపోవడం.. లేదా తర్వాత ఆ స్థానంలోకి వేరే హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ వచ్చి చేరడం అనేది సినీ పరిశ్రమలో సాధారణంగా జరుగుతుంటుంది. ఈ ‘అమిగోస్’ విషయంలోనూ అదే అయ్యింది. దర్శకుడు ఈ కథను ముందుగా 2018 టైంలో మరో హీరోకి చెప్పాడట. ఆ వివరాలేంటో చూద్దాం..
‘అమిగోస్’ స్టోరీని డైరెక్టర్ రాజేంద్ర రెడ్డి ఫస్ట్.. రౌడీ హీరో విజయ్ దేవరకొండకు వినిపించాడట. కొత్త డైరెక్టర్ పైగా మూడు క్యారెక్టర్లు.. ఎలా చేయాలో అనుకున్నాడో.. లేక దర్శకుడు ఎలా తీస్తాడు అనుకున్నాడో కానీ అప్పుడు ‘అమిగోస్’ రిజెక్ట్ చేసి ‘డియర్ కామ్రేడ్’ సెలెక్ట్ చేసుకున్నాడు విజయ్.. ఆ సినిమా నిర్మించింది కూడా మైత్రీ వారే.. రిజల్ట్ ఏంటనేది తెలిసిందే. ఇక కళ్యాణ్ రామ్‌కి రాజేంద్ర రెడ్డి కథ చెప్పగానే సింగిల్ సిట్టింగ్‌లో ఒకే చేశాడట..
మరి తన జడ్జిమెంట్ ఏంటనేది ఫిబ్రవరి 9న యూఎస్ ప్రీమియర్స్‌తో తెలిసిపోతుంది. ఎందుకంటే ఇతర హీరోలు నో చెప్పిన ‘బింబిసార’ తీసి కెరీర్‌లో మైల్ స్టోన్ లాంటి మెమరబుల్ మూవీని అందుకున్నాడు కళ్యాణ్ రామ్.. ‘అమిగోస్’ మూవీకి సంబంధించిన ఈ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.