Pawan Kalyan: మరోసారి పవన్ కళ్యాణ్ తో టాలీవుడ్ నిర్మాతల మంతనాలు!
- October 1, 2021 / 05:22 PM ISTByFilmy Focus
టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ ను ఈ రోజు ఉదయం టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు మళ్ళీ మరోసారి కలుసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల పవన్ చేసిన వ్యాఖ్యలకు ఒక్కసారిగా వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఆ తరువాత టాలీవుడ్ నిర్మాతలతో మాట్లాడి ఇండస్ట్రీలోకి అండగా ఉంటున్నట్లు ప్రెస్ మీట్స్ కూడా పెట్టారు. ఇటీవల పేర్ని నానితో మీటింగ్ నిర్వహించి ఇండస్ట్రీలోని సమస్యలపై కూడా సానుకూలంగా చర్చలు జరిగినట్లు చెప్పారు.
అయితే అంతకుముందు పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులపై చేసిన కామెంట్స్ అనంతరం టాలీవుడ్ నిర్మాతలు పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కు మాకు ఎలాంటి సంబంధం లేదని పరోక్షంగా ప్రకటన కూడా విడుదల చేశారు. ఆ విషయంలో కూడా పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యలు చెప్పుకున్నారు కాబట్టి వాటిపై ప్రశ్నించడం జరిగిందని కూడా వివరణ ఇచ్చారు. ఇక ఇప్పుడు సడన్ గా మళ్ళీ టాలీవుడ్ నిర్మాతలు పవన్ కళ్యాణ్ తో నవ్వుతూ కనిపించడం హాట్ టాపిక్ గా మారింది.

దిల్ రాజు, దానయ్య, నవీన్ ఎర్నేని, వంశీ రెడ్డి, సునీల్ నారంగ్, బన్నీ వాసు లు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది. చిత్రపరిశ్రమకు సంభందించిన సమస్యల గురించి సృహృద్భావ వాతావరణంలో వీరి మధ్య చర్చలు జరిగాయట. మరి ఈ మూమెంట్ ఎలా హైలెట్ అవుతుందో చూడాలి.
రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

















