‘బాహుబలి’ (సిరీస్) కు ముందు… తెలుగు సినిమాల బిజినెస్ 70 కోట్లు లోపే ఉండేది. అది కూడా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి హీరోలకు మాత్రమే ఉండేది. కానీ తరువాత ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ కూడా ఈ లిస్టులో చేరారు. అదంతా బాహుబలి పుణ్యమనే చెప్పాలి. అంతేకాదు అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థలు వచ్చాక … నిర్మాత కు థియేట్రికల్ మీదే డిపెండవ్వాల్సిన అవసరం తగ్గింది.
నాన్ థియేట్రికల్ పరంగా కూడా నిర్మాతకు కొంత రికవరీ అవ్వడం జరుగుతుంది. అయితే నాన్ థియేట్రికల్ లెక్కలను బిజినెస్ లో పరిగణించరు. ఇదిలా పక్కన పెడితే.. అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన తెలుగు సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) బాహుబలి 2 : 350 కోట్లు (అన్ని భాషలు కలిపి)
2) సాహో : 290 కోట్లు (అన్ని భాషలు కలిపి)
3) సైరా నరసింహా రెడ్డి : 200 కోట్లు (అన్ని భాషలు కలిపి)
4) అజ్ఞాతవాసి : 126 కోట్లు (ఒక్క తెలుగు మాత్రమే)
5) స్పైడర్ : 125 కోట్లు (తెలుగు + తమిళ్)
6) బాహుబలి 1 : 117 కోట్లు (అన్ని భాషలు కలిపి)
7) సరిలేరు నీకెవ్వరు : 101 కోట్లు (ఒక్క తెలుగు మాత్రమే)
8) మహర్షి : 100 కోట్లు (ఒక్క తెలుగు మాత్రమే)
9) భరత్ అనే నేను : 100 కోట్లు (ఒక్క తెలుగు మాత్రమే)
10) అరవింద సమేత : 91 కోట్లు (ఒక్క తెలుగు మాత్రమే)
11) వినయ విధేయ రామా : 90 కోట్లు (ఒక్క తెలుగు మాత్రమే)
12) ఖైదీ నెంబర్ 150 : 92 కోట్లు (ఒక్క తెలుగు మాత్రమే)
13) సర్ధార్ గబ్బర్ సింగ్ : 87.7 కోట్లు(తెలుగు +హిందీ)
14) జై లవ కుశ : 86 కోట్లు (ఒక్క తెలుగు మాత్రమే)
15) కాటమరాయుడు : 85.5 కోట్లు (ఒక్క తెలుగు మాత్రమే)