శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘హ్యాపీడేస్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ సందేశ్ అటు తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘కొత్త బంగారు లోకం’ మూవీలో కూడా నటించాడు. ఇవి రెండు బ్లాక్ బస్టర్ లు అయ్యాయి.వీటి తర్వాత ‘ఏమైంది ఈ వేళ’ వంటి హిట్ మూవీలో కూడా నటించాడు. అయితే అటు తర్వాత వరుణ్ నటించిన సినిమాలు అన్నీ ఒకదాని మించి మరొకటి అన్నట్టు ప్లాప్ లు అవ్వడంతో ఇతని ఫైన్ కెరీర్ డౌన్ ఫాల్ అయ్యింది. అయితే ‘బిగ్బాస్3’ లో వరుణ్ తన భార్య వితికతో కలిసి కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు.
అతని ప్రవర్తన.. గేమ్ ఆడిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఓ దశలో ఇతనే విన్నర్ అవుతాడని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు.అయినప్పటికీ ‘బిగ్ బాస్’ తో మళ్ళీ వరుణ్ కు క్రేజ్ పెరిగిందనే చెప్పాలి. ఈ క్రమంలో అతను ‘ఇందువదన’ అనే మూవీలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఫర్నాజ్ శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు పాటలకి మంచి స్పందన లభించింది. త్వరలో విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు వరుణ్. ఇందులో భాగంగా యాంకర్.. ‘తరుణ్, ఉదయ్ కిరణ్ హీరోలలా మీరు కూడా మొదట్లో మంచి ఫేం సంపాదించుకున్నారు…కానీ వరుస ఫ్లాప్స్ వలన తర్వాత ఫామ్ ను కోల్పోయారు కదా’ అంటూ ప్రశ్నించింది.
దీనికి వరుణ్ సందేశ్ స్పందిస్తూ.. “వాళ్ళిద్దరితో నన్ను పోల్చొద్దు. ఉదయ్ కిరణ్ నాకు బాగా తెలుసు. ఆయన పర్సనల్ లైఫ్ లో ఏం జరిగుంటుందో తెలీదు కానీ అతనికి అలా జరిగే సరికి నేను చాలా ఫీలయ్యాను. అలాగే తరుణ్ కూడా తెలుసు.నేను నా చేతుల్లో నుండీ జారిపోయినదాన్ని తిరిగి తెచ్చుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను. బిగ్బాస్ తర్వాత నేను కొన్ని ప్రాజెక్ట్స్ కు సైన్ చేయడం జరిగింది. కోవిడ్ కారణంగా అవి ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. దాంతో యూఎస్ కు వెళ్లి ఐటీ కోర్సు చేశాను. ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచన కూడా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు.