టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ మరియు డిస్ట్రిబ్యూటర్ అయిన సురేష్ బాబు పై వెంకటేష్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. అంతేకాదు మరోపక్క సురేష్ బాబు పై డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి కారణం అందరికీ ఊహించేదే. ‘నారప్ప’, ‘దృశ్యం-2’ ‘విరాటపర్వం’ వంటి చిత్రాలను ఆయన ఓటిటికి విడుదల చేసే ఆలోచనలో ఉండడమే.! దీనికి సంబందించిన డీల్ ను కూడా ఆయన క్లోజ్ చేసినట్టు తెలుస్తుంది.
‘దృశ్యం-2’ ని డిస్ని ప్లస్ హాట్ స్టార్ కు ఆయన అమ్మేసారు.దీని గురించి అటు వెంకీ అభిమానులు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ పెద్దగా సురేష్ బాబుని విమర్శించడం లేదు. ఎందుకంటే దాని ఒరిజినల్ వెర్షన్ కూడా అమెజాన్ ప్రైమ్ ఓటిటిలోనే విడుదలైంది. కానీ ‘నారప్ప’ అనేది మొదటి నుండీ జనాల్లో ఆసక్తి పెంచిన ప్రాజెక్టు. ఇది తమిళంలో సూపర్ హిట్ అయ్యి.. నేషనల్ అవార్డుని సొంతం చేసుకున్న ‘అసురన్’ కు రీమేక్. కాబట్టి మొదటి నుండీ ఈ చిత్రం పై మంచి అంచనాలు నెలకొన్నాయి.
గతంలో ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేస్తున్నారు అనే ప్రచారం జరిగినప్పుడు స్వయంగా సురేష్ బాబే.. ఇది లార్జ్ స్కేల్ ఉన్న సినిమా.. దీనిని ఆడియెన్స్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయాలనే ఉద్దేశంతో తెరకెక్కించాం.. ఓటిటికి ఇచ్చే ప్రసక్తే లేదు’ అని ఆయన చెప్పారు. ‘దృశ్యం2’ విషయంలో కూడా ఆయన ఇదే మాట చెప్పారు. అన్నిటికీ మించి ఆయన థియేటర్ యాజమాన్యాన్ని కాపాడాల్సిన వ్యక్తి. అలాంటి సురేష్ బాబు.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి అని అందరూ వాపోతున్నారు.