విక్కీ కౌశల్ బాలీవుడ్‌లో హిస్టారికల్ డ్రామాలతో సత్తా చాటుతున్నాడు. ‘వేవ్స్ 2025’ సమ్మిట్‌లో నిర్మాత దినేష్ విజన్, ఇండియన్ కల్చర్‌లో రూట్ చేసిన కథలు చెప్పడం ఎంత ముఖ్యమో వివరిస్తూ, విక్కీ కౌశల్ (Vicky Kaushal) నటిస్తున్న ‘మహావతార్’ సినిమా గురించి కీలక విషయాలు పంచుకున్నాడు. మడాక్ ఫిల్మ్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం తమ బ్యానర్‌లో ఇప్పటివరకు అతి పెద్ద వెంచర్ అని దినేష్ వెల్లడించాడు. విక్కీ కౌశల్ ఈ సినిమాలో చిరంజీవి (Chiranjeevi) పరశురాముడిగా నటిస్తున్నాడు.
2026 క్రిస్మస్‌కు ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో ఈ భారీ హిస్టారికల్ డ్రామా రూపొందుతోంది. విక్కీ కౌశల్ (Vicky Kaushal) ఫిల్మోగ్రఫీని పరిశీలిస్తే, అతని విజయాలు ఎక్కువగా ఎంచుకున్న పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ వల్లే వచ్చాయని తెలుస్తుంది. ‘సామ్ బహదూర్’లో సామ్ మానేక్షా, ‘ఛావా’లో (Chhaava) ఛత్రపతి శంభాజీ మహారాజ్ వంటి చారిత్రక పాత్రలు ఆల్రెడీ ప్రజల్లో పేరున్నవి కావడంతో ఆడియన్స్ వాటిని సులభంగా ఆదరించారు.
‘ఉరి’, ‘సామ్ బహదూర్’, ‘ఛావా’ వంటి సినిమాలు జాతీయవాదం, హిస్టారికల్ నేపథ్యంతో వచ్చినవే. అందుకే విక్కీకి ఆ పాత్రలు సక్సెస్‌ను తెచ్చాయి, ఇప్పుడు ‘మహావతార్’ కూడా అదే బాటలో సాగుతుందని దినేష్ విజన్ వ్యాఖ్యల నుంచి అర్థమవుతోంది. ‘మహావతార్’లో విక్కీ చిరంజీవి పరశురాముడిగా నటిస్తున్నాడు, ఇది హిందూ పురాణాల్లో శ్రీ మహావిష్ణువు ఆరవ అవతారం. ఈ పాత్ర కూడా భారీ వెయిట్ ఉన్నది కావడంతో, సినిమా హిట్ అయితే విక్కీ స్టార్‌డమ్ మరింత పెరిగినట్లే.
విక్కీ కౌశల్ ఇదే బాటలో కొనసాగితే, అతను నైపుణ్యం కలిగిన నటుడిగా ఒక రేంజ్ లో క్రేజ్ పెంచుకునే అవకాశం ఉంటుంది. ‘ఛావా’తో 2025లో విజయం సాధించిన విక్కీ, ఇప్పుడు ‘మహావతార్’తో మరో హిస్టారికల్ డ్రామాలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. నవంబర్ 2025లో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా, 2026 క్రిస్మస్‌కు విడుదల కానుంది. ఈ సినిమా విజయం విక్కీ కెరీర్‌లో మరో రికార్డ్ అవుతుందా లేదా అనేది చూడాలి.