క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్నఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ లో సినిమా లైఫ్ ని చూపించబోతున్నారు. ఇందుకు ‘కథానాయకుడు’ అనే అటైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీ జనవరి 9 న రిలీజ్ కానుంది. ఇక ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని రెండో భాగంలో చూపించనున్నారు. ఇందుకు మహానాయకుడు అనే అటైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమా జనవరి 24 న థియేటర్లోకి రానుంది. ఈ రెండు భాగాల్లో ఎన్టీఆర్ రోల్ పోషిస్తున్న బాలకృష్ణతో పాటు.. ఉండనున్న మరో వ్యక్తి విద్యాబాలన్. ఆమె ఎన్టీఆర్ భార్య బసవతారకమ్మ పాత్రలో కనిపించనుంది. ఆమె ద్వారానే కథ నడుస్తుంటుంది.
అంతటి ప్రాముఖ్యమైన రోల్ ని ఎలా పోషిస్తుందోనని ఫ్యాన్స్ మొదట్లో అనుమానం వ్యక్తం చేశారు. ఈరోజు అందరికీ నమ్మకం కలిగింది. ఎందుకంటే ఆమె లుక్ రిలీజ్ చేశారు. బసవతారకంగా ఆకట్టుకుంది. ఇక నటనాపరంగా అత్యుత్తమ నటన కనబరుస్తుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏఎన్నార్ గా సుమంత్, కృష్ణ గా సుధీర్ బాబు, చంద్రబాబు నాయుడిగా రానా నటించనున్న ఈ చిత్రంలో నరేష్ నిర్మాత బొగట వెంకట సుబ్బారావు పాత్రలో కనిపించనున్నారు. శ్రీదేవి పాత్రకోసం రకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకున్నారు. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరిలతో కలిసి బాలయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలపై అంచనాలు రోజురోజుకి పెరుగుతున్నాయి.