ఇది బయోపిక్ సీజన్. బాలీవుడ్‌తో సహా అన్ని ప్రాంతీయ భాషల్లో బయోపిక్ సినిమాల నిర్మాణం జోరుగా సాగుతోంది. క్రీడాకారుల, రాజకీయ నేతల, విద్యావేత్తల జీవిత చరిత్రలను తెరకెక్కిస్తున్నారు. తాజాగా రాజకీయ నేతల కథలు కూడా వెండితెరను ఆవిష్కరించనున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ విడుదలైంది. జయలలిత, ఎన్టీఆర్ జీవిత చరిత్రలను సినిమాలుగా తీస్తున్నారు. తాజాగా ఉత్తర పదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయవతి చరిత్రను సినిమాగా తీసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది.
అతి సామాన్య కుటుంబం నుండి దళితనేతగా అత్యున్నత స్థానం వరకు ఎదిగిన మాయావతి జీవితాన్ని సుభాష్ కపూర్ అనే దర్శకుడు సినమాగా తీస్తున్నట్టు సమాచారం. మాయవతి పాత్రలో విద్యాబాలన్ చేత నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై విద్యాబాలన్ నుండి అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు. ఇటీవలే విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్‌లో బసవతారకం పాత్రని విద్యాబాలన్ పోషించిన విషయం తెలిసిందే.