తమిళంతో పాటు తెలుగు లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ సేతుపతి. అయన హీరోగా నటించిన లాభం సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వినాయక చవితి సందర్భంగా విడుదల అయిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా విజయ్ సేతుపతి నటించిన తీరుకు ప్రేక్షకులు ముగ్దులు అయిపోయారు. రైతు సంఘాన్ని చేతుల్లో పెట్టుకుని ఓ వ్యాపారవేత్త రైతులపై పెత్తనం చెలాయిస్తూ , రైతు భూముల్ని, రైతులపైన అధికారాన్ని చెలాయిస్తూ ఉంటాడు.
అలాంటి సమయంలో హీరో రైతు సంఘం అధ్యక్షుడిగా ఎన్నిక అవుతాడు. ఈ క్రమంలో ప్రజల కోసం ఎలాంటి మంచి పనులు చేశాడు, పెత్తం దారుల ఆటలని ఎలా అడ్డుకున్నాడు అనే ఆసక్తికరమైన కథాంశంతో సినిమా తెరకెక్కి తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సినిమాలోని ప్రతి సన్నివేశానికి ప్రేక్షకులు ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. దర్శకుడు మంచి పాయింట్ ని తీసుకుని సినిమా గా చేసి ప్రేక్షకులను నచ్చే విధంగా సినిమా చేశాడు. రైతు సంఘం నేపథ్యం లో సాగే డ్రామా ప్రేక్షకులను ఎంతో ఆసక్తి పరిచింది. ప్రతి పాత్ర కూడా ఎంతో అర్థవంతంగా ఉంటుంది. ఇనాం భూముల వెనక చరిత్ర, రైతులు ఇంకా పేదవాళ్లుగా మిగిలిపోవడానికి కారణాల్ని చాలా చక్కగా చూపించారు.
ఈ సినిమా కి ప్రధాన ఆకర్షణ విజయ్ సేతుపతి నటన. శ్రుతి హసన్ కూడా ప్రేక్షకులను మెప్పించింది. జగపతి బాబు మరో పవర్ ఫుల్ రోల్ లో కనిపించాడు. ఈ చిత్రానికి కథే బలం.. చాలా విలువైన, ఎవరు చెప్పని విషయాలని సినిమా ద్వారా వెల్లడించి ప్రేక్షకులని మేల్కొలిపేలా ఉంది సినిమా.. దర్శకుడు ప్రతి పాత్ర ను ఎంతో అర్థవంతంగా తీర్చిదిద్దాడు. నిర్మాణ విలువల విషయంలో కూడా నిర్మాత ఏవిధంగా కాంప్రమైజ్ అవ్వలేదు. ఓవరాల్ గా ఈ సినిమా ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు కుటుంబం తో చూడదగిన మంచి సినిమా.