రచయితగా అనేక ఏళ్ళ అనుభవం కలిగిన విజయేంద్ర ప్రసాద్ తెలుగు వారు గర్వించే బాహుబలి వంటి కథను అందించారు. అంతకముందు కూడా ఎన్నో హిట్ సినిమాలకు కథలు అందించిన ఈయన మళ్ళీ మెగా ఫోన్ అందుకున్నారు. ఒక వ్యక్తి చనిపోయిన తరువాత ఆలోచనలను చదివే శక్తీ మరో వ్యక్తికి ఎలా ఉంటుందో అనే విభిన్నమైన కథాంశంతో ‘శ్రీ వల్లి’ అనే సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయేంద్ర ప్రసాద్ మగధీర సినిమా గురించి అనేక సంగతులు వెల్లడించారు. “సింహాద్రి తరువాత చిరంజీవిని దృష్టిలో పెట్టుకుని రాసిన కథ ‘మగధీర.
ఈ కథను చిరంజీవిని కలిసి వివరించడం, ఆయన ఒకే ఒకే చెప్పడం కూడ జరిగిపోయింది. అయితే అనుకోకుండా ఈ కథకు చరణ్ హీరోగా మారారు” అని చెప్పారు. “ముఖ్యంగా ‘మగధీర’ సినిమాలో 100 శత్రువులను చంపే సీన్ ను తను చిరంజీవిని దృష్టిలో పెట్టుకుని రాసుకున్నాము. ఆ సీన్ లో చరణ్ నటించి మెప్పించాడు” అని ఆనాటి సంగతులు గుర్తుకు తెచ్చుకున్నారు. మరి మగధీర చిరంజీవి చేసి ఉంటే ఆయన ఇమేజ్ కి, స్క్రీన్ ఏజ్ కి మరిన్ని రికార్డులు తిరగరాసి ఉండేదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.