స్టార్ కపుల్ అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ఫాన్స్ కి పండగ లాంటి వార్త చెప్పారు. త్వరలో వీరికి అమ్మానాన్నా హోదా దక్కనున్నట్లు తెలియజేశారు. అనుష్క శర్మ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. గర్భవతిగా ఉన్న అనుష్క శర్మ భర్త విరాట్ తో పోజిచ్చిన ఫోటో పంచుకోవడంతో పాటు, 2021 జనవరిలో ముగ్గురం అవుతాం అని కామెంట్ పెట్టారు. ఆ ఫొటోలో అనుష్క శర్మ గర్భవతి అన్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది.
జనవరిలో డెలివరీ ఉంటుందన్న నేపథ్యంలో అనుష్క శర్మ ఇప్పటికే 4 నెలల గర్భవతి అని తెలుస్తుంది. మరి ఈ జంట ఇన్నాళ్లు ఈ విషయం ఎందుకు దాచారో అర్థం కావడం లేదు. చాలా కాలంగా అనుష్క పబ్లిక్ ప్రదేశాలలో కనిపించడం లేదు. దానికి కారణం ఏమిటో నేడు అర్థం అయ్యింది. ఇక విరాట్-అనుష్క శర్మల మధ్య ప్రేమ 2014లో మొదలైంది. అప్పట్లో వీరిద్దరిపై అనేక రూమర్స్ రాగా, తరువాత తమ బంధాన్ని బయటపెట్టి పబ్లిక్ గా తిరిగారు.
ఓ మూడేళ్లు ప్రేమప్రయాణం చేసిన ఈ జంట 2017లో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. వీరి పెళ్ళై మూడేళ్లు దాటిపోతుండగా ఇన్నాళ్లకు పిల్లల్ని ప్లాన్ చేశారు. కాగా 2008లో విడుదలైన రబ్ నే బనాది జోడి చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన అనుష్క స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. బ్యాండ్ భాజా బారాత్, పీకే వంటి చిత్రాలు ఆమెకు మంచి పేరుతెచ్చిపెట్టాయి.
View this post on Instagram
And then, we were three! Arriving Jan 2021 ❤️🙏
A post shared by Virat Kohli (@virat.kohli) on
Most Recommended Video
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!