మహేష్‌బాబు – త్రివిక్రమ్ సినిమా ఉందా? లేదా? ఉంటే ఎప్పుడు? ఇలాంటి ప్రశ్నలకు క్లోజింగ్ బటన్ నొక్కతూ ఇటీవల టీమ్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. పనిలోపనిగా వచ్చే సంక్రాంతికి వచ్చేస్తాం అంటూ డేట్ కూడా ఇచ్చేసింది. దీంతో ఇక త్రివిక్రమ్ – మహేష్ మ్యాజిక్ కోసం వెయిట్ చేయడమే అంటున్నారు. అయితే విషయం ఇక్కడితో తేలిపోయిందా? అన్నీ సమసిపోయాయా? అనే ప్రశ్న మాత్రం అలానే ఉంది. ఆ మాటకొస్తే #SSMB28 విషయంలో వచ్చిన మొదటి డిస్ట్రబెన్స్ ఇంకా అలానే ఉంది అంటున్నారు.
#SSMB28 సినిమా అనౌన్స్ చేసినప్పుడు.. థమన్ సంగీతం అనే పాయింట్ చూసి.. మరో మ్యూజికల్ వండర్ రెడీ అనుకున్నారు. అయితే ఏమైందో ఏమో సినిమా అనౌన్స్ చేసిన కొద్ది రోజులకే ‘సినిమా నుండి తమన్ అవుట్’ అనే మాట వినిపించింది. ఆ తర్వాత చర్చలు జరిగాయని, అంతా కుదురుకుందని అన్నారు. అనుకున్నట్లుగా సినిమా వాయిదా పడీ పడీ మొదలయ్యేసరికి హమ్మయ్య అనుకున్నారు. ఇప్పుడు మళ్లీ థమన్ సంగీతం టాపిక్ మళ్లీ చర్చకు వచ్చింది. దీనికి కారణం థమన్‌తో పెట్టుకుంటే సమయానికి సంగీతం రాదు అని.
‘సర్కారు వారి పాట’ సమయంలో థమన్ సంగీతం విషయంలో ఫ్యాన్స్, పని విషయంలో (Mahesh) మహేష్ ఇబ్బంది పడ్డారు అని అంటారు. పాటల నాణ్యత అంతగా లేకపోవడం, సమయపాలన విషయంలోనూ ఇబ్బందిపెట్టడం లాంటివి కారణాలుగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు మళ్లీ #SSMB28 సినిమా విషయంలోనూ అలాంటి పరిస్థితే వస్తే ఏంటి అనేది ప్రశ్న. ఇటీవల కాలంలో తన లేట్ వర్క్ విషయంలో తనకు తానే సెటైర్ వేసుకున్నాడు కూడా. అయితే అవన్నీ నవ్వులు తెప్పిస్తున్నాయి కానీ పని రావడం లేదు అనేది మాట.
ఓవైపు సినిమాలు, మరోవైపు ఇండియన్ ఐడల్ తెలుగు, ఇంకోవైపు క్రికెట్.. ఇలా మూడూ అడ్జస్ట్ చేస్తూ వస్తున్నారు తమన్. దీంతో అనుకున్న సమయానికి కంటెంట్ తమన్ నుండి రావడం లేదు అనేది అపవాదు. దీంతో తర్వాత ఇబ్బంది పడే కంటే ఇప్పుడే క్లియర్ చేసుకుంటే బెటర్ అని మహేష్‌కు అభిమానులు సూచిస్తున్నారు. ఇంకెన్నాళ్లూ ఈ టామ్ అండ్ జెర్రీ గేమ్‌లా కాకుండా ఏదో ఒక క్లారిటీ తీసుకుంటే బాగుండు అనేది వారి కోరిక. మరి మహేష్ ఏమంటాడో చూడాలి.