పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ కఠిన దీక్ష చేపట్టారు. నాలుగు నెలల పాటు చాతుర్మాస్య దీక్ష ఆయన చేయనున్నారు. మరి ఈ దీక్ష ప్రకారం ఆయన నాలుగు నెలలు కఠిన నియమాలు పాటించనున్నాడు. ముఖ్యంగా బ్రహ్మచర్యం, నదీస్నానం, ఒంటి పూట భోజనం, నేలపై పడుకోవడం, కోపం ద్వేషం వంటి ఎమోషన్స్ వదిలేసి శాంతికా ముఖుడు కానున్నాడు. పవన్ ఈ దీక్ష దేశంలో ప్రజల క్షేమం కోసం చేస్తున్నారట. ఓ ప్రక్క మూడు సినిమాలు పూర్తి చేయాల్సివుండగా పవన్ ఇలాంటి కఠిన నియమాలు కలిగిన దీక్ష చేపట్టడం ఇబ్బందికర అంశమే.
గంటల తరబడి సెట్ లో గడపాలంటే చాలా ఎనర్జీ కావాలి. మరి ఒక పూట భోజనం చేసి ఆయన సినిమాకు ఏమి న్యాయం చేయగలడు. ఐతే కరోనా వైరస్ కారణంగా షూటింగ్స్ మొదలుకావడానికి చాలా సమయం పట్టేలా కనిపిస్తుంది. అసలు 2021 వరకు షూటింగ్స్ మొదలుకాకపోవచ్చనే మాట కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ ఈ దీక్ష చేపట్టి ఉండవచ్చు. మరో వైపు పవన్ బీజేపీలో చేరి హిందూత్వ వాది అయ్యారు. కాబట్టి పొలిటికల్ గా ఈ విషయం ఆయనకు కలిసొచ్చే అంశం కావచ్చు.
ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూడు చిత్రాలు ఒప్పుకొని ఉన్నారు. వాటిలో వకీల్ సాబ్ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇంకా 20 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలివుంది. మరో వైపు క్రిష్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామా చేస్తున్నారు. ఈ చిత్రం కూడా చిత్రీకరణ దశలో ఉంది. హరీష్ శంకర్ తో ప్రకటించిన చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.