బాహుబలి ( సిరీస్) తో ప్రభాస్ ఇమేజ్ పెరిగింది. పక్క భాషల్లో కూడా ప్రభాస్ కు ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఆ తర్వాత వచ్చిన సాహో నార్త్ లో పర్వాలేదు అనిపించినా.. మిగిలిన భాషల్లో చేతులెత్తేసింది. తెలుగులో కూడా ఆ మూవీ డిజాస్టర్. ఇక రాధే శ్యామ్ సంగతి చెప్పనవసరం లేదు. ఈ సినిమాకి సాహో కంటే బెటర్ టాక్ వచ్చినా… లవ్ స్టొరీ కాబట్టి ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకుంది అంటూ ఏమీ లేదు. ఇక ఆదిపురుష్.. విషయంలో కూడా ఫ్యాన్స్ ఆలోచన అలాగే ఉంది.
టీజర్ కి బ్యాడ్ టాక్ వచ్చింది. ట్రైలర్ పర్వాలేదు అనిపించినా…అందులో కొత్త కథ అంటూ ఏమీ లేదు. రామాయణంలో ఎవ్వరికీ తెలియని కోణాన్ని .. దర్శకుడు ఓం రౌత్ చూపిస్తాడు అని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేనట్టు ఉంది. ట్రైలర్ లో గతంలో చూసిన రామాయణమే కనిపించింది. సో ఇది నార్త్ ఆడియన్స్ కోసం తీసి ఉండొచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఆదిపురుష్ కి మంచి టాక్ వచ్చినా…. రిపీట్ ఆడియన్స్ ఉండకపోవచ్చు.
ఫ్యాన్స్ కూడా ఆధ్యాత్మిక చిత్రాలను రెండోసారి చూస్తారు అని చెప్పలేం. సో (Prabhas) ప్రభాస్ అభిమానుల ఫోకస్ అంతా.. సలార్ పైనే ఉంది అని చెప్పాలి. కె.జి.ఎఫ్ తో ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. సలార్ లో ప్రభాస్ మాస్ లుక్ తో కనిపిస్తున్నాడు. సో ప్రభాస్ ఫ్యాన్స్ తమ ఆకలి తీర్చే చిత్రం సలార్ అవుతుంది అని అంతా అనుకుంటున్నారు.