ఎన్టీఆర్ కు హీరోగా ఉన్న స్టార్ డమ్, క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, ఇక నటుడిగా మనోడి స్టామినా గురించి తెలియనివాళ్లు లేరంటే అతిశయోక్తి కాదేమో. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న ఎన్టీఆర్ కి ఒక మైనస్ పాయింట్ కూడా ఉంది. అదేంటంటే.. ఎన్టీఆర్ నటించిన సినిమాకి ఎంత భీభత్సమైన టాక్ వచ్చినా ఆ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వదు అని. ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాలు కూడా బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయాయి. గత నాలుగు చిత్రాల్లో “జనతా గ్యారేజ్” మినహా మరో సినిమాకి బ్రేక్ ఈవెన్ రాలేదు. దాంతో ఎన్టీఆర్ సినిమాకి లాభాలు రావు అని ఫిలిమ్ నగర్ లో అనుకొంటుంటారు.
అయితే.. ఇప్పుడు అరవింద సమేత విషయంలో కూడా ఈ ప్రశ్న తలెత్తుతోంది. ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ తోపాటు ఓపెనింగ్స్ కూడా సంపాదించిన ఈ చిత్రం కలెక్షన్స్ రోజురోజుకీ పెరగాల్సింది పోగా.. క్షీణిస్తున్నాయి. ఈ విషయం డిస్ట్రిబ్యూటర్స్ ని అయోమయంలోకి నెట్టేస్తుంది. దసరా సీజన్ కి మరో రెండు సినిమాలు బరిలోకి దిగడంతో ఇప్పుడు ఆ రెండు సినిమాలను దాటుకొని ఎన్టీఆర్ సినిమా జనాల్సి ఆకర్షించి థియేటర్లకు రప్పించడం అనేది కాస్త కష్టం. అందులోనూ ఫ్యాక్షన్ సినిమా అనేసరికి ఫ్యామిలీ ఆడియన్స్ దూరంగా ఉంటుండడంతో సినిమాకి వర్కింగ్ డేస్ లో ఆశించిన స్థాయి కలెక్షన్స్ రాలేదు. సో, ఇప్పుడు అరవింద సమేత కూడా మిగతా సినిమాల తరహాలో సూపర్ హిట్ టాక్ కు మాత్రమే పరిమితమవుతుందా లేక “జనతా గ్యారేజ్”లా బ్రేక్ ఈవెన్ సాధించి డిస్ట్రిబ్యూటర్స్ కి ఎగ్జిబిటర్స్ కి లాభాలు తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.