స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఈ మధ్య కాలంలో మరీ నిదానంగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఒక్కో సినిమాకు రాజమౌళి 3 నుంచి 4 సంవత్సరాల సమయం తీసుకుంటున్నారు. కొంతమంది డైరెక్టర్లు ఏడాదికి 1 లేదా 2 సినిమాలను తెరకెక్కిస్తుండగా రాజమౌళి మాత్రం సినిమాల విషయంలో నత్తనడకన అడుగులు వేస్తున్నారు. ప్రశాంత్ నీల్ లా జక్కన్న కూడా సినిమాలకు సంబంధించి వేగం పెంచాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాజమౌళి తర్వాత ప్రాజెక్ట్ మహేష్ హీరోగా తెరకెక్కుతోంది.
ఈ సినిమా విడుదలయ్యేది 2026లోనే అని మహేష్ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. జక్కన్న వేగంగా తెరకెక్కిస్తే మాత్రమే ఆ సమయానికి ఈ సినిమా విడుదలవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే జక్కన్న డైరెక్షన్ లో నటిస్తూనే మరో సినిమాలో మహేష్ నటిస్తే బాగుంటుందని మహేష్ బాబు అభిమానులు కోరుకుంటున్నారు. ఈ విధంగా చేస్తే మహేష్ కు కెరీర్ పరంగా గ్యాప్ రాదు. ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే చిరంజీవి విజ్ఞప్తి మేరకు ఆచార్య మూవీ షూటింగ్ లో చరణ్ పాల్గొనడానికి రాజమౌళి ఛాన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
రామ్ చరణ్ కు ఛాన్స్ ఇచ్చినట్టే మహేష్ కు కూడా రాజమౌళి ఛాన్స్ ఇవ్వొచ్చుగా అని కామెంట్లు వినిపిస్తున్నాయి. మహేష్ ఫ్యాన్స్ కోరికను రాజమౌళి పట్తించుకుంటారో లేదో చూడాల్సి ఉంది. రాజమౌళి డైరెక్షన్ లో సినిమా కోసం మహేష్ ఏకంగా రెండేళ్ల డేట్లు కేటాయించారని తెలుస్తోంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీ 3000 కోట్ల రూపాయల కలెక్షన్ల టార్గెట్ తో తెరకెక్కుతోందని సమాచారం.
రాజమౌళి సినిమాలు అంటే ఇతర భాషల ప్రేక్షకుల్లో సైతం భారీగా అంచనాలు ఏర్పడుతున్నాయి. రాజమౌళి సినిమా సినిమాకు కథ, కథనం విషయంలో ఏ మాత్రం పొంతన లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహేష్ తో జక్కన్న తెరకెక్కించే మూవీ హాలీవుడ్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తోంది.