ఆచార్య సినిమా ఫ్లాప్ కావడానికి ప్రధానమైన కారణాలలో నక్సలిజం బ్యాక్ డ్రాప్ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కడంతో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ సైతం ఆశించిన స్థాయిలో జరగలేదు. ఈతరం ప్రేక్షకులకు నక్సలిజం గురించి, నక్సలైట్ల గురించి అవగాహన లేకపోవడం కూడా ఆచార్యకు మరో విధంగా మైనస్ అయింది. అయితే ఆచార్య రిజల్ట్ తేలిపోవడంతో ప్రస్తుతం అందరి దృష్టి విరాటపర్వం సినిమాపై పడింది.
విరాటపర్వం సినిమా రానా, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా వేణు ఊడుగుల డైరెక్షన్ లో తెరకెక్కి విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావడం లేదు. ఈ సినిమా థియేటర్లలోనే విడుదలవుతుందని ప్రచారం జరుగుతున్నా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ఆచార్య, విరాటపర్వం నక్సలిజం బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కడంతో ఆచార్య రిజల్ట్ రానాను ఒకింత టెన్షన్ పెడుతోందని తెలుస్తోంది. చాలా సంవత్సరాల క్రితం నక్సలిజం బ్యాక్ డ్రాప్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నా ఈ మధ్య కాలంలో ఈ తరహా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అవుతున్నాయి.
త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. సాయిపల్లవి వరుస విజయాలతో జోరుమీదుండగా ఈ సినిమాతో సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో విరాటపర్వం తెరకెక్కగా ఈ సినిమా కచ్చితంగా విజయం సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రానా ఈ సినిమాతో కచ్చితంగా మరో సక్సెస్ ను సొంతం చేసుకోవాల్సి ఉంది.
రానా కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఈ ఏడాది భీమ్లా నాయక్ సినిమాతో రానా ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ చేరిందనే సంగతి తెలిసిందే. రానా సినిమాను బట్టి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. రానా విరాటపర్వంతో సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.